బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం అంటే?: మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేసీఆర్ ఫైర్
ముంబై: తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అన్ని వనరలూ ఉన్న మహారాష్ట్ర ఇంకెంతో అభివృద్ధి చెందాలన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోలాపూర్ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశానికి లక్ష్యం ఏమైనా ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. లక్ష్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా స్వాతంత్య్ర పోరాటం చేపట్టాలని, కొత్త ఉదయం దిశగా.. క్రాంతి మార్గంలో దేశం నడవాలన్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి.. కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు ప్రజలు అధికారం ఇచ్చారని, చేయాలనుకుంటే ఎవరైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏమీ చేయలేకపోయినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి.. మహారాష్ట్రలో ఎందుకు కావడం లేదన్నారు.

రైతుల మంచి కోసం ఏదైనా చేయవచ్చు అన్నారు. తనకు మరాఠీ రాదు అని, కానీ అన్నీ అర్థం చేసుకోగలనన్నారు. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం.. ధనవంతమైన రాష్ట్రం అన్నారు. భారత్ పరివర్తన్ మిసన్ నడుస్తోందన్నారు. పండరీ దర్శనం కోసం వస్తే.. దర్శనం చేసుకోండి.. కానీ రాజకీయం చేయకండి అన్నారని కొందరు నేతలు అన్నట్లు సీఎం తెలిపారు. పండరీ పుణ్య స్థలం అని.. అక్కడ ఏమీ చెప్పలేదు.. కానీ ఇక్కడ అనకుండా ఉండలేనన్నారు. మహా నేతలు ఎందుకు ఆక్రోశానికి లోనవుతున్నారని ఆయన ప్రశ్నించారు. మేం ఎవరి టీమ్ కాదు.. కిసాన్ టీమ్ మాది.. అల్పసంఖ్యాకుల టీమ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ వ్యాఖ్యలు చేసిన క్రమంలో కేసీఆర్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
जो पहाड़ों से टकराया असे तूफान कहते हैं ।
— Aravind Alishetty (@aravindalishety) June 27, 2023
जो पहाड़ों से टकराया असे तूफान कहते हैं ।
👉 जो तूफान उसे टकराए उसे केसीआर कहते हैं 🔥#KCR #Maharashtra pic.twitter.com/oMoPnJmlCC
తెలంగాణ, మహారాష్ట్ర కోసం ఏర్పడిన పార్టీ తమది కాదన్నారు కేసీఆర్. దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ.. పరివర్త భారత్ కావాలన్నారు. ఔరంగబాద్‌లో 8 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయన్నారు. సోలాపూర్‌లో 5 రోజులకు ఒకసారి వస్తాయన్నారు. అకోలాలో కూడా నీళ్లు రావడం లేదన్నారు. కేంద్ర జలవిధానాన్ని బంగాళాఖాతంలో వేయాలన్నారు. జలనీతిని మార్చేస్తాం. నయా భారత్‌ను రూపొందిస్తాం. దేశంలో నీళ్లు లేవంటే అది మరో మాట అవుతుందని, కానీ నేతల మాయమాటలు చెప్పి నీళ్లు ఇవ్వలేకపోయినట్లు ఆరోపించారు.
తెలంగాణలో ధరణి పోర్టల్‌తో భూముల్ని డిజిటలైజ్ చేసినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పథకాల అమలు .. మహారాష్ట్రలో ఎందుకు జరగవని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్‌లో చేరిన మరాఠీ నేత భగీరథ్ బాల్కేకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పశ్చిమ మహారాష్ట్ర దర్వాజ్ ఓపెన్ చేసిన బాల్కేకు అండగా ఉంటామన్నారు. పండరీపుర వికాసం మొత్తం బాల్కే చేతుల మీదుగా జరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల దేశానికి ఒరిగేదేం లేదన్నారు. ఎన్నికల్లో గెలివాల్సింది పార్టీలు కాదని.. ప్రజలు గెలవాలన్నారు. కేంద్రానికి దమ్ముంటే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లందించాలని తెలిపారు. తాము చేస్తున్న యుద్ధంలో న్యాయం ఉన్నందున కచ్చితంగా గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు, మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహించారు కేసీఆర్.












Click it and Unblock the Notifications