వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దేశ్ కీ నేత': మరింత బలంగా కేసీఆర్?, కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం జాతీయ రాజకీయాల ఊసెత్తడం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ డ్యామేజ్‌గా మారనుంది. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల ప్రస్తావనతో.. ప్రధాన స్రవంతి మీడియాతో సహా సోషల్ మీడియా అంతా దీని పైనే చర్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్రచారం కరువైందనే అభిప్రాయం వినిపిస్తోంది.

లెక్క గట్టిగానే ఉంది: కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు.. లెక్క గట్టిగానే ఉంది: కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

బస్సు యాత్రకు కవరేజీ కరువు?:

బస్సు యాత్రకు కవరేజీ కరువు?:

కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర మొదలుపెట్టిన నాడే.. కేసీఆర్ కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి ఫోకస్ అంతా తనవైపుకు తిప్పుకున్నారు.

ఇప్పుడేమో జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించి.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాక తన గురించి చర్చ జరిగేలా చేసుకున్నారు. తెలంగాణ జనం కూడా ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బస్సు యాత్రను పట్టించుకునేవారు కరువయ్యారు అనే వాదన వినిపిస్తోంది.

కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు..:

కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు..:

నిజానికి ఈ నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత మొదలైందనే వాదన ఉంది. ఆ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఆ మేరకే బస్సు యాత్రకూ సిద్దమైంది. కానీ ఇంతలోనే కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు రావడంతో కాంగ్రెస్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి.

'దేశ్ కీ నేత':

'దేశ్ కీ నేత':

జాతీయ రాజకీయాలను గురిపెట్టడం.. థర్డ్ ఫ్రంట్ కు పలు పార్టీల అధినేతలు మద్దతు తెలపడం.. కేసీఆర్ మళ్లీ అద్భుతం చేయబోతున్నారా? అన్న చర్చకు ఆస్కారం ఇచ్చింది. తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు కూడా స్వప్నాన్ని ముద్దాడుతాడని ఎవరూ ఊహించలేదు.. ఇప్పుడు కూడా ఏమైనా జరగవచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి.

ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఆయనకు సమవుజ్జీ అయిన ప్రతిపక్షనేత ఇప్పటికైతే కనుచూపు మేరలో కూడా లేరు. కేసీఆర్ ఇప్పుడు 'దేశ్ కీ నేత'గా ఎదిగితే.. ఇక ఆయన్ను అందుకోవడం రాష్ట్ర కాంగ్రెస్‌కి మరింత కష్టం.

మరింత బలపడుతున్న కేసీఆర్..:

మరింత బలపడుతున్న కేసీఆర్..:


జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంతమేర రాణిస్తారన్నది పక్కనపెడితే.. దానిపై జరుగుతున్న చర్చ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సమస్యలను తెరమరుగు చేసే అవకాశం ఉంది. ప్రజల్లో చర్చంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల చుట్టే తిరగడం.. కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా అన్న ఊహాగానాలతో ఆయన మరింత బలమైన నేతగా ప్రజలకు కనిపించబోతున్నారు. ఈ పరిణామాలన్ని కాంగ్రెస్ భవిష్యత్తుకు మరింత జటిలమనే చెప్పాలి.

English summary
Telangana Chief Minister KCR's third front strategy is a big damage to Congress party in the state. Congress BUS campaign is now out of the news
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X