గేర్ మార్చిన కేసీఆర్, కొత్త అస్త్రం - చివరి నిమిషంలో సీన్ మార్చేనా..!!
తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ..కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ హైదరాబాద్ లోనే మకాం వేసారు. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ గేర్ మార్చుతున్నారు. చివరి రెండు రోజుల్లో కొత్త అస్త్రాల ప్రయోగానికి సిద్దమయ్యారు. కేసీఆర్ నిర్ణయాలు కలిసి వస్తాయా..హ్యాట్రిక్ విజయం తెచ్చిపెడతాయా.
హోరా హోరీ పోరు: తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 80 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయం తమదేనని బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం చెబుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాల పైన కేసీఆర్ కీలక సమీక్ష చేసారు. ప్రచారం తుది దశకు చేరటంతో నియోజవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

సర్వే నివేదికలను సమీక్షించారు. ఎక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఏ అంశాలు ప్రభావితం చూపుతున్నాయనే వాటి పైన కసరత్తు చేసిన కేసీఆర్..ఇప్పుడు చివరి రెండు రోజుల్లో తన వ్యూహం మార్చేందుకు సిద్దమయ్యారు. ఈ రెండు రోజుల ప్రచార సభల్లో కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేసీఆర్ కొత్త వ్యూహం: కాంగ్రెస్ ప్రధానిగా సీఎం కేసీఆర్ వైఖరి...అమలు కాని హామీలు..మహిళలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు..నిరుద్యోగ యువత పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. యువత బీఆర్ఎస్ కు దూరం అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు గుర్తించారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతోంది. అదే సమయంలో మహిళల మద్దతు ఎవరి వైపు ఉందనేది కేసీఆర్ ప్రత్యేకంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ప్రతీ నియోజకవర్గంలో గ్రౌండ్ రియాల్టీని సమీక్షించిన కేసీఆర్.. పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేసారు. మరో రెండు మూడు కొత్త పథకాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ మూడు రోజుల ప్రచారంలో కేసీఆర్ వీటినే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కీలక ప్రకటనల దిశగా: ప్రత్యేకించి యువతను ఆకట్టుకోవటంతో పాటుగా..మహిళా ఓట్ బ్యాంక్..గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే, కేసీఆర్ చివరి నిమిషంలో చేసే ఈ ప్రకటనల ద్వారా ఏ మేర ఓటర్ల పైన ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
అదే విధంగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే చేపట్టాల్సిన కార్యాచరణ పైన కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఎన్నికల వార్ నుంచి ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తోంి. దీంతో, తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ఏ ప్రకటనలు చేయబోతున్నారు...ఎలాంటి మార్పు వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications