ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ: కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో ఎక్కడైనా భూములను ఆక్రమిస్తే ప్రజలు తన దృష్టికి తేవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కబ్జాలను ఉపేక్షించేది లేదని, నగరంలోని కబ్జా భూములను బయటకు తీస్తానని ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో పేదలకు త్వరలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణనగర్ కాలనీలను సిఎం కెసిఆర్ సందర్శించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై తన అభిప్రాయాలను కాలనీ ప్రజలతో పంచుకున్నారు. నగరాన్ని బృందావనంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌ను మొత్తం 330 భాగాలుగా విభజించి, ఒక్కో భాగానికి ఒకరిని బాధ్యులుగా చేసి అక్కడ అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఒక్కో విభాగం అభివృద్ధి బాధ్యత తీసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైందన్నారు. హైటెక్ సిటీని నిర్మించామని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్లుగా నగరం సమస్యలమయంగా మారిందన్నారు. ప్రగతి నగర్ తరహాలో అన్ని కాలనీలు ఔషధ మొక్కలు నాటాలని కోరారు. నగరంలో కాలనీవాసులు రోడ్లపై చెత్తవేయడం మానుకోవాలని, ప్రతి ఇంటి ముందూ చెత్తవేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు ఉండాలన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు ఉండవన్నారు. ముఖ్యమంత్రి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారి కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. మమతానగర్ కాలనీలో సిసి కెమెరాల కొనుగోలు కోసం ముఖ్యమంత్రి వెయ్యి రూపాయల విరాళం అందించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటే కాలనీలు బాగుంటాయి, కాలనీలు బాగుంటే హైదరాబాద్ నగరం బాగుంటుందన్నారు. కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు శాంతిభద్రతల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మమతానగర్ కాలనీకి మరోసారి వచ్చి మార్పును చూస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌తోపాటు పార్టీ నేతలు, సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, అధికారులు పర్యటనలో పాల్గొన్నారు.

కెసిఆర్
నగరంలో ఎక్కడైనా భూములను ఆక్రమిస్తే ప్రజలు తన దృష్టికి తేవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

కెసిఆర్
కబ్జాలను ఉపేక్షించేది లేదని, నగరంలోని కబ్జా భూములను బయటకు తీస్తానని ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో పేదలకు త్వరలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు.

కెసిఆర్
ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణనగర్ కాలనీలను సిఎం కెసిఆర్ సందర్శించారు.

కెసిఆర్
ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై తన అభిప్రాయాలను కాలనీ ప్రజలతో పంచుకున్నారు. నగరాన్ని బృందావనంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చెప్పారు.

కెసిఆర్
హైదరాబాద్‌ను మొత్తం 330 భాగాలుగా విభజించి, ఒక్కో భాగానికి ఒకరిని బాధ్యులుగా చేసి అక్కడ అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

కెసిఆర్
గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఒక్కో విభాగం అభివృద్ధి బాధ్యత తీసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

కెసిఆర్
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైందన్నారు. హైటెక్ సిటీని నిర్మించామని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్లుగా నగరం సమస్యలమయంగా మారిందన్నారు.

కెసిఆర్
కాలనీల్లో చాలామంది సంపన్నులు ఉంటారని, సంపన్నుల విరాళాలతో కాలనీలు సొంతంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విరాళాల నుంచి పేదలను మినహాయించాలని సూచించారు.

కెసిఆర్
మురికిలేని నగరంగా అభివృద్ధి పర్చుకోవాలని అన్నారు. కాలనీలు బాగుపడాలంటే ఎవరో చేయాలని ఎదురు చూడొద్దని, మన కాలనీ మనమే అభివృద్ధి చేసుకుందామనే ఆలోచన ఉండాలని సూచించారు.

కెసిఆర్
కాలనీవాసులు కలిసికట్టుగా అభివృద్ధి పనులు చేసుకోవాలన్నారు. నగర శివార్లలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, ప్రతి ఇంటివారూ మొక్కలు నాటాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications