ఫీవర్ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబర్‌పేటలో జరిగిన మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలో పాల్గొన్న సీఎం అనంతరం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిని సందర్శించి, ఆవరణను పరిశీలించారు.
ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గల సౌకర్యాలపై వైద్యులను ఆరా తీశారు. నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు.
బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తాం: జోగు
బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన జ్యోతిరావుబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అనాడే చదువుకున్న ప్రాధాన్యతను గుర్తించి పూలే పాఠశాలలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. గజ్వేల్‌లో గురుకుల మహిళ డిగ్రీ కాలేజీ నిర్మించబోతున్నామని తెలిపారు.

మూడు బీసీ గురుకుల స్కూళ్లను మంజూరు చేశామని చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు ఇద్దరు డైరెక్టర్లను నియమించాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులు అక్కడే ఉండే విధంగా హాస్టళ్ల నిర్మిస్తామన్నారు. విద్యార్థుల ప్యాకెట్ మనీ విషయం కూడా ఆలోచిస్తామన్నారు. బీసీల అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తదని మంత్రి హామీ ఇచ్చారు.
బాసరలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు
ఆదిలాబాద్ జిల్లా బాసరలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సందర్శించారు. శనివారం ఉదయం బాసర సరస్వతీ అమ్మవారిని విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ సిబ్బంది, పూజారులు, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.












Click it and Unblock the Notifications