హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు ఏపీ అభిమాని గిఫ్డ్: తండ్రికోసం కవిత, తాతకోసం హిమాన్షు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కాగా, సీఎం కేసీఆర్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి పట్టు వస్ర్తాలు, కానుకలు సమర్పించుకున్నారు. అంతకు ముందు సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కెసిఆర్ రావడంతో ఆలయం వద్ద కార్యకర్తలు, అభిమానుల సందడి నెలకొంది.

నాన్నను దీవించమ్మ: ఎంపీ కవిత

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘నాన్న(కెసిఆర్)ను చల్లగా దీవించు తల్లి' అని అమ్మవారిని వేడుకున్నారు. కవితతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పూజలో పాల్గొన్నారు.

KCR worshipped at Peddamma temple

తాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మనవడు హిమాన్షు

సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా తాత పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్ యూసఫ్‌గూడ చెక్‌పోస్టులోని ప్రభుత్వ పాఠశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న హిమాన్షు కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచాడు. స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిమాన్షు కాసేపు విద్యార్థులతో ముచ్చటించాడు.

KCR worshipped at Peddamma temple

అనంతపురం అభిమాని అపురూప కానుక

కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ అభిమాని అపురూపమైన కానుకను బహూకరించారు. ధర్మవరం పట్టు శాలువాలపై కెసిఆర్ దంపతుల చిత్రాలను చాకచక్యంగా నేసిన ఆ అభిమాని దానిని కేసీఆర్‌కు స్వయంగా అందించారు.

నేతలో ఒదిగిపోయిన చిత్రాలను చూసిన కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అతని ప్రతిభను అభినందించారు. రాష్ట్రాలు విడిపోయినా కేసీఆర్ పైనున్న అభిమానంతో పట్టశాలువా నేసి తీసుకొచ్చానని తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చానని చెప్పారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Wednesday held worship at Peddamma temple in Hyderabad on occasion of his birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X