జూబ్లీహిల్స్ బై పోల్ ప్రచారానికి కేసీఆర్..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా నామినేషన్ల పర్వం కూడా ముగిసిన నేపథ్యంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్ లిస్టును బీఆర్‌ఎస్ రిలీజ్ చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో కేసీఆర్ పేరు ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అడుగుపెడితే గెలుపు కన్ఫామ్ అని పార్టీ కార్యకర్తలు, నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లిస్టులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా 40 మంది పేర్లతో జాబితా ఉంది. ఈ లిస్టును తాజాగా ఈసీకీ అందజేసింది బీఆర్‌ఎస్ పార్టీ. ఈ లిస్ట్ ను ఎన్నికల కమిషన్ ఆమోదించింది.
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేరు ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. జూబ్లీహిల్స్ లో తమ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జూబ్లీహిల్స్ కాలనీల్లో కలియ తిరుగుతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారా..? లేక బహిరంగ సభ నిర్వహిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టును బీజేపీ రిలీజ్ చేసింది. 40 మందితో జాబితా విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో రాజస్థాన్ సీఎం, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ మంత్రి సత్యకుమార్, పురందేశ్వరి.. తదితరులు ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. 2023లోనూ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
— BRS Party Bellampalli (@TrsBellampalli) October 21, 2025
పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..@BRSparty pic.twitter.com/abOEpBoCVa
ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ టికెట్ కోసం మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. తదితరులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. కానీ నవీన్ యాదవ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. ఇక నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతగా నవీన్ కు మంచి పేరు ఉంది. అందుకే అధిష్ఠానం నవీన్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ కు బీసీ వర్గాల్లోనూ మంచి పట్టుంది.

ఇక నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 21గా ఉంది. అక్టోబర్ 22వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉప సంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబరు 11 న జరగనుంది. అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications