Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కేసీఆర్ ఏమన్నారంటే?

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని అన్నార. ఈ సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి అండగా నిలిచిన పార్టీలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా తాము తీర్చిదిద్దితే నిలబెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు.

KCR s response on the HCU land issue

ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠను ఈ ప్రభుత్వం దిగజార్చిందని కేసీఆర్ మండిపడ్డారు. హెచ్‌సీయూ విషయంలో మరోసారి రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా చేశారని కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

ఆ మూడు జిల్లాల నేతలతో కేసీఆర్ కీలక భేటీ

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు సిహెచ్. లక్ష్మారెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, వీ. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల్. వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నేతలు డా. ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముఖ్య నేతలు మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు, లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నేతలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నేత విజయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశన్నగారి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+