కేరళ వరద బీభత్సం: నెల వేతనం ఇచ్చిన కేటీఆర్, ఇంద్రకరణ్

హైదరాబాద్: కేరళలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు తక్షణ సాయంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ప్రకటించింది. ఇతర ప్రజాప్రతినిధులు, సామాన్యులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు.

కేరళ భాదితులకు తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. రవీంద్ర భారతిలో హైదరాబాద్ మలయాళ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేరళ వరద బాధితుల సహాయనిధి శిబిరాన్ని ప్రారంభించారు.

Kerala floods: Minister Indrakaran Reddy gives 1 month pay

ఈ సందర్భంగా మాట్లాడారు. సహాయనిధి శిబిరానికి నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. వరదల కారణంగా ఆకలితో ఆలమటిస్తున్న కేరళ ప్రజలకు ఈ సహాయనిది ద్వారా కొంత మేలు జరుగుతుందన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న మలయాళీలు తమకు తోచిన సహాయాన్ని నగదు, దుస్తులు, తినుబండారాలు, మంచి నీరు, నిత్యావసర వస్తువులు విరాళంగా ఇచ్చారు. కేరళకు ఇప్పటికే 200 లారీల నిత్యవసర వస్తువులు చేరాయని, ఇకపై దాతలు నగదు రూపంలో విరాశం ఇవ్వాలని మలయాళి అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు సహాయంగా ఇచ్చింది. తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా తన నెల వేతనాన్ని ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+