అయ్యప్ప దర్శనం ఇక సులభంగా- తాజా నిర్ణయం..!!
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి భారీగా అయ్యప్ప మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గత అనుభవాలతో ఈ సారి ఆలయ అధికారులతో పాటుగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారు సులభంగా దర్శిం చు కొనేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ పోర్టల్ సాయంతో సులభంగా అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములతో శబరిమల నిండిపోయింది. వరుసగా భారీ వర్షాలతో శబరిమల యాత్రలో భక్తులకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. కొందరు భక్తులు సొంత వాహనాల్లో శబరిమలకు వెళ్తున్నారు. అయితే, రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం కేరళ పోలీసులు ఒక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాత్రలో ఇబ్బందులు పడకుండా పోలీస్ గైడ్ అనే పోర్టల్ ప్రారంభించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఉపయోగపడేలా ఇందులో సమాచారం అందుబాటులో ఉంచారు. శబరిమలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తం చేసారు. శబరిమల చరిత్ర తో పాటుగా వాహనాల పార్కింగ్, అంబులెన్స్ సేవల సమాచారం కూడా పొందు పరిచారు. పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కేఎస్‌ఆర్టీసీ, అంబులెన్సు, అగ్నిమాపక దళం, ఫుడ్ సేఫ్టీకి చెందిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. అన్ని జిల్లాల నుంచి శబరిమలకు రాక పోకలు సాగించేందుకు వీలుగా ఉన్న రవాణా మార్గాలను వివరించారు. విమానం, రైలు, రోడ్డు మార్గాల వివరాలను శబరిమల - పోలీస్ గైడ్ పోర్టల్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications