కేరళలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి: తెలంగాణలో కొత్త కేసులు ఎన్నంటే?

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారినపడి మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అడ్వజైరీ జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 కరోనా వైరస్ (Coronavirus) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఆరోగ్య సిబ్బంది 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తన బులిటెన్‌లో వెల్లడించింది. దాదాపు 6 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది.

Kerala registers 115 new Covid cases today: 4 new cases in Telangana

కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కేరళలో 115 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరుకుంది.

మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా నమోదైన 142 కేసుల్లో కేరళలో 115 కేసులు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలిపింది. అయితే, గత 24 గంటల్లో రాష్ట్రంలో వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదు.

కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత గత 24 గంటల్లో కోలుకున్న, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 112కి చేరుకుంది. దీంతో, ఈ కేటగిరీ కింద మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 68,36,979కి పెరిగింది.

మరోవైపు, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ సోమవారం అడ్వైజరీ జారీ చేసింది.

రానున్న పండగల సీజన్‌లో కరోనా వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఇన్‌ఫ్లూయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. భారత్ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. అప్రమత్తంగా ఉంటూ. కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని.. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+