మహిళలకు 500రూపాయల గ్యాస్ సిలిండర్ రాయితీపై కీలక అలెర్ట్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలకమైన అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వంట గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన సబ్సిడీ మహిళల బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది .

మహాలక్ష్మీ పథకం.. లబ్దిదారులకు వంట గ్యాస్ సిలిండర్ రాయితీపై అలెర్ట్
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చిన ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తోంది. అయితే మూడు నెలలుగా 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ కి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ లబ్ధిదారుల ఖాతాలలో జమ కావడం లేదు. దీంతో మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్లు పొందుతున్న మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Key alert on Rs 500 gas cylinder subsidy for women in mahalakshmi scheme in telangana

Take a Poll

మహాలక్ష్మీ పథకంలో రాయితీ సొమ్ము మహిళల ఖాతాల్లో
ప్రస్తుతం వంటగ్యాస్ సిలిండర్ ధర 915రూపాయలుగా ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు 915 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత వీరికి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రాయితీ వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 500 రూపాయలు మినహాయించి మిగతా మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది.

ఆ నిధులు రాక గ్యాస్ సిలిండర్ రాయితీలో జాప్యం
కేంద్ర ప్రభుత్వం నుంచి 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 375 రూపాయలు కలిపి మొత్తం 415 రూపాయల సబ్సిడీ లబ్ధిదారులకు లభిస్తోంది. అయితే గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ జమ కాకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. లబ్ధిదారుల ఖాతాలో ఈ నిధులు జమ కాకపోవడం వెనుక 150 నుంచి 180 కోట్ల రూపాయల వరకు నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కావలసి ఉందని సమాచారం.

ఆ నగదు ఇస్తామని చెప్తున్న సర్కార్.. కానీ మహిళల అసహనం
ఆ నిధులు విడుదల అయితే మహిళల ఖాతాలలో సిలిండర్లకు సంబంధించిన రాయితీ డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం కావడం వల్ల వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని సమాచారం. అయితే ఈ రాయితీలు పూర్తిగా నిలిచిపోవని, త్వరలోనే వీటన్నింటినీ క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మహిళలలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.

గ్యాస్ సిలిండర్ రాయితీ ఇవ్వకుంటే ప్రభుత్వ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే
ప్రభుత్వం అందిస్తామని చెప్పిన సంక్షేమ పథకాన్ని ఆదిలోనే హంసపాదు అన్నట్టు కొంతకాలం పాటు కూడా కొనసాగించలేకపోతే ఎలా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులకు సమయానికి అన్నీ అందించగలిగితే ప్రయోజనం ఉంటుందని, లేదంటే ప్రభుత్వ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాలలో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని త్వరితగతిన జమ చేయాలని మహిళలు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వంపైన మహిళలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+