కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ సహా టీ కాంగ్రెస్ కీలక నేతల భేటీ: 13న రాహుల్ రాక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ సహా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక భేటీ జరిగింది. రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సుమారు గంటన్నరపాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన, పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా పరిణామాలపైనా చర్చించారు. కాగా, ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరైన విషయం తెలిసిందే.

ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్
ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని మహేశ్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్, కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ ఉంటుందన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించామన్నారు. ప్రజల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలకే డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వడం జరుగుతుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications