"తెలంగాణ కాశ్మీర్" అందాలు అదరహో.. ఈ సీజన్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!
సహజసిద్ధమైన అడవులకు ఆదిలాబాద్ నిలయంగా ఉంది. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తయిన కొండలు, జలపాతాలు, సెలయేర్లు.. ఇలా ప్రకృతి అందాల నడుమ ఈ జిల్లా ఉంటుంది. అందుకే ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని తెలంగాణ కాశ్మీర్ అని పిలుస్తుంటారు. ఇక జిల్లాలోని ఖండాల ప్రాంత అందాల వీక్షణ మరో అద్భుతంగా చెప్పవచ్చు. ఖండాల ప్రాంతం అందాలు కాశ్మీర్ అందాలను పోలి ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలు అటుగా వెళ్లే ప్రయాణికులను కనువిందు చేస్తున్నాయి. చూపు తిప్పుకోలేని ఈ ప్రకృతి అందాల వద్ద సెల్ఫీలు దిగుతూ ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సెలవు రోజులు, వీకెండ్స్ లో కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేందుకు ఖండాల ప్రాంతం చక్కటి ప్రాంతంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామం ఖండాల. ఈ ప్రాంతం మొత్తం పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, ఉప్పొంగే జలపాతాలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా, మొలాల్ గుట్ట జలపాతం ఖండాల గ్రామానికి సమీపంలో ఉంటుంది. దట్టమైన పచ్చని అడవులు, గుట్టలు, జలపాతాలు ఈ ప్రాంతానికి అద్భుతమైన అందాన్ని ఇస్తాయి. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కాశ్మీర్ ప్రాంతాన్ని తలపించేలా కనువిందు చేస్తున్న ప్రకృతి సౌందర్యం ఖండాల సొంతం.

ఈ ప్రకృతి అందాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి 25 నుండి 30 కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. దారి పొడవునా వంపులు తిరుగుతూ కొండల మీద నుండి వెళ్లే నల్లటి తారు రోడ్డు.. ఎటు చూసినా మైమరిపించే ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. మేఘాలు, పొగమంచు ఈ గిరిజన గూడేలను తాకుతూ వెళ్లే దృశ్యాలను చూస్తే తెలియని అనుభూతికి లోనవుతారు. ఈ ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూడాలంటే తెల్లవారుజామునే ఖండాలకు చేరుకుంటే ఆస్వాదించవచ్చు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతం విషయానికి వస్తే.. ఇక్కడ గుట్టల్లో ఉన్న రెండు మూడు జలపాతాలు కలిసి ఖండాల జలపాతంగా చెబుతారు. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తే ఎవరికైనా అక్కడే ఉండిపోవాలని అనిపించడం సహజం. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కాశ్మీర్ మాదిరి వాతావరణం ఉంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని చూసేందుకు టూరిస్టులు అధికంగా వస్తుంటారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఈ అటవీ ప్రాంతాలన్నీ సందర్శకులతో కళకళలాడుతుంటాయి. ఇక ఈ ప్రాంతంలో ఖండాల వాటర్ ఫాల్స్ తో పాటు ఇచ్చోడ మండలంలోని గుండి వాగుపై సుమారు 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న గాయత్రీ జలపాతం మరో ఆకర్షణగా ఉంటుంది. ఖండాల అటవీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్లు ఉండగా కోసాయి 28 కిలోమీటర్లు, గాయత్రి జలపాతం, కుంటాల జలపాతం నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications