ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు; నవీన్ రెడ్డి మహా ముదురు; వరంగల్లోనూ అతనిపై కేసు!!

మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వందమంది ఇంటిపై వీరంగం వేసి, అడ్డొచ్చిన వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టి, విధ్వంసం సృష్టించి యువతిని కిడ్నాప్ చేసినటువంటి ఘటనలో నిందితుడైన నవీన్ రెడ్డి చేసిన నేరాలను తవ్వుతున్న పోలీసులకు వరంగల్ జిల్లాలో అతనిపై గతంలో చీటింగ్ కేసు నమోదైనట్లుగా తెలిసింది.

వరంగల్ ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డిపై చీటింగ్ కేసు

వరంగల్ ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డిపై చీటింగ్ కేసు

ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ లో చీటింగ్ చేశాడని 2019లో వరంగల్ ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. గతంలో హైదరాబాద్ కేంద్రంగా విజయాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించిన నవీన్ రెడ్డి తమ కంపెనీలో పెట్టుబడి పెడితే రెండింతల లాభం ఇస్తామంటూ ఆన్లైన్ వేదికగా ప్రకటనలు ఇవ్వడంతో, నిజమని నమ్మిన ఐదుగురు ఇందులో డబ్బులను ఇన్వెస్ట్ చేశారు. అంతకు ముందు ఒకరిద్దరికి ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాలు ఇచ్చిన నవీన్ రెడ్డి, వారి ద్వారా మిగతా వారిని మోసం చేశారు.

ఆన్ లైన్ బిజినెస్ పేరుతో టోకరా.. పోలీసులు అరెస్ట్

ఆన్ లైన్ బిజినెస్ పేరుతో టోకరా.. పోలీసులు అరెస్ట్


మీరు పెట్టిన పెట్టుబడి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు ఇప్పిస్తామని చెప్పి నవీన్ రెడ్డి కంపెనీ వరంగల్ జిల్లాలో ఐదుగురికి ఆరు లక్షల రూపాయలకు టోకరా వేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 2019లో ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 420 సెక్షన్తోపాటు ఐటీ యాక్ట్ 66 (డీ) కింద నవీన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు . అతడిని అప్పుడు అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత కేసును వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేయగా, తరువాత జైలు నుండి నవీన్ రెడ్డి విడుదలయ్యారు.

ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి నేరాలను తవ్వి తీస్తున్న పోలీసులు

ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి నేరాలను తవ్వి తీస్తున్న పోలీసులు


ప్రస్తుతం ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్ రెడ్డి యువతి పైనా, ఆమె తల్లిదండ్రులపైనా ఆరోపణలు చేశారు. యువతి తనను పెళ్లి చేసుకుందని, ఆమె ఫ్యామిలీ తనను ఆర్ధికంగా వాడుకున్నారని అతను పోలీసులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అయితే సదరు యువతి నవీన్ రెడ్డి చెప్పింది అబద్ధం అని పేర్కొన్నారు. పోలీసులు అతని గురించి గట్టిగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో నవీన్ రెడ్డి గత నేరాలను కూడా పరిగణన లోకి తీసుకుంటున్న క్రమంలో అతని పై పీడీ యాక్ట్ పెట్టడం కోసం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పాత కేసులను తిరిగితోడుతున్నారు.

 నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెడతారా?

నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెడతారా?


ఈ క్రమంలో వరంగల్ లో చేసిన చీటింగ్ బయటకు వచ్చింది. ఇంకా నవీన్ రెడ్డిపై ఎక్కడెక్కడ ఏయే కేసులు ఉన్నాయి అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక నవీన్ రెడ్డి పై లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నవీన్ రెడ్డి మామూలోడు కాదు మహా ముదురు అని గుర్తిస్తున్నారు. మరి నవీన్ రెడ్డి విషయంలో పోలీసులు ముందు ముందు ఏం చేయనున్నారు, పీడీ యాక్ట్ పెడతారా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+