ఈటెలకు పరామర్శల వెల్లువ: కిరణ్ కుమార్ రెడ్డి, దత్తాత్రేయ
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. గురువారం ఆయన ఫోన్ చేసి ఈటెల రాజేందర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఈటెల రాజేందర్‌ను కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈటెల గాయపడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. కాగా మంత్రి తన కాలుకు శస్త్రచికిత్స నిమిత్తం నేడు తిరిగి దవఖానాలో చేరనున్నారు.

ఈటెలకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా రాజేందర్‌ను పరామర్శించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆస్పత్రిలో ఇటీవల ఈటెల రాజేందర్‌ను పరామర్శించారు.
పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఈటెల రాజేందర్‌ను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ టిడిపి నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు ఆయనను పరామర్శించారు.












Click it and Unblock the Notifications