హుజూరాబాద్‌ను మించి.. గజ్వేల్‌లో బీజేపీ భారీ ర్యాలీ: కేసీఆర్‌పై కిషన్, ఈటల విమర్శలు
సిద్దిపేట: కేసీఆర్(KCR) సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డితో కలిసి మంగళవారం గజ్వేల్‌లో ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లారు. బీజేపీ నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం వదిలిన బాణం ఈటల రాజేందర్ అని అన్నారు. గజ్వేల్‌కు ఈటల రావడంతో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. గజ్వేల్‌లో గెలుస్తాననే నమ్మకం కేసీఆర్‌కు లేదని.. ఆ ఓటమి భయంతోనే కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామన్నారు.

స్వరాష్ట్రంలో ప్రజలను కేసీఆర్.. బానిసలుగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్(BRS)కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి వేసినట్లేనన్నారు. భారతీయ జనతా పార్టీకి వేస్తే భవిష్యత్ తరాల అభివృద్ధికి ఓటేసినట్లవుతుందని స్పష్టం చేశారు. డబ్బుతో గజ్వేల్ ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోగా, ఉన్నవాటినీ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ పాలన వస్తుందని.. బడుగు బలహీన వర్గాల పాలన రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
It’s BJP 🪷-
— G Kishan Reddy (@kishanreddybjp) November 7, 2023
All the way at Gajwel.
Joined Shri @Eatala_Rajender garu at his election nomination rally today in Gajwel.#TelanganaWithBJP#BJP4Telangana pic.twitter.com/KvEtQ6JKIy
అనంతరం ఈటల రాజేందర్ (Etala rajender) మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. తనకు హుజూరాబాద్ కంటే గజ్వేల్‌లోనే అధిక మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 20 వేల మందికి ఫోన్ చేస్త.. 50 వేల మంది వచ్చారని ఈటల హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పంచాయితీ జరుగుతుందన్నారు. పేదల కలలు కొల్లగొట్టిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. హుజూరాబాద్ కంటే గజ్వేల్‌లోనే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు ఉద్యమంలా పని చేసి పార్టీని నిలబెట్టాలని.. నవంబర్ 30న ప్రతి బూతులో పెద్ద సంఖ్యలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!











Click it and Unblock the Notifications