Kishan Reddy: బడ్జెట్ ద్వారా తెలంగాణకు కూడా లబ్ధి.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే?

Kishan Reddy: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైందని.. ఇది మధ్య తరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు జరిగే లబ్ధి గురించి మీడియా సమావేశంలో వివరించారు. ఈ బడ్జెట్ లో కేంద్రం పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన తెలిపారు. మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం మోడీ సర్కార్ రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు. ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుని ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన మొదటి అడుగు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా, ఆ తర్వాత యుద్ధాల కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నామయ్యాయన్నారు.

తెలంగాణకు ఏమి ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని.. కేంద్ర బడ్జెట్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. కేంద్రం అమలు చేసే అన్నిపథకాల్లో తెలంగాణ భాగస్వామిగా ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో తెలంగాణకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని.. దేశవ్యాప్తంగా 27 రంగాల్లో స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నారు. వీటి కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. దీని ద్వారా తెలంగాణలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి వివరించారు. 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలతో తెలంగాణ లబ్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Kishan Reddy on Union Budget 2025 Benefits for Telangana Too

కేంద్ర సర్కారు ఏ సంస్కరణలు తీసుకొచ్చినా.. తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రజలకు ఖచ్చితంగా ఉంటుందన్నారు. కేంద్ర పథకాల పరిధిని నిధుల వాటాను బడ్జెట్ లో పెంచాలని వెల్లడించారు. తెలంగాణకు రూ.10 వేల కోట్లు రాబోతున్నాయని చెప్పారు. గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తెలంగాణలో ఉన్న 125 అర్బన్ లోకల్ బాడీస్ కు అమృత్ పథకం కింద లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్వనిధి పథకం వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+