రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలంటూ కిషన్ రెడ్డి: బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారన్నారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌​లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు ప్రత్యామ్నాయం కమలం పార్టీనేనని అన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగడుగునా నిలదీస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్‌ మాట్లాడారని, ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి హితవు పలికారు. కాంగ్రెస్​ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయట్లేదని కిషన్​ రెడ్డి ఆరోపించారు.

Kishan Reddy slams cm revanth reddy for congress guarantees implementation issue

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని మండిపడ్డారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారని, ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. హామీలపై అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీస్తామని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు కిషన్ రెడ్డి.

బీఆర్ఎస్​ ఇచ్చిన పథకాల అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఆగిపోయాయని తెలిపారు. కేసీఆర్​ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయా? లేవా? అనేది ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారని.. బ్రహ్మండమైన ఫలితాలు రాబోతున్నాయని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అర్బన్​ ప్రాంతాల్లో ఓటర్ల లిస్ట్​‌ను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు కిషన్​ రెడ్డి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్​, చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గాల్లో ఓటర్​ లిస్ట్​‌ను సంస్కరించాలని గతంలో పలుమార్లు జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఒక్కొక్క నియోజకవర్గాల్లో దాదాపు 20 వేల ఓట్లు అధికారులు తొలగించారని ఆరోపించారు. దీనిపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.

బీజేపీ అనుకూలమైన ఓట్లు తొలిగించారని కిషన్​ రెడ్డి ఆరోపించారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. కొంత మంది వ్యక్తుల పేర్లు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని తెలిపారు. ఓటు నిర్ణయించడంలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేలా ఎన్నికల సంఘం ఆలోచిస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+