‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ వేదికగా కిషన్ రెడ్డి ప్రసంగం.!కేంద్రమంత్రి యూఎస్ పర్యటన.!
న్యూఢిల్లీ/హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (HLPF) సమావేశాల్లో ప్రసంగించేందుకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.. నిన్న బుదవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం.. 14వ తేదీ మధ్యాహ్నం 1.15 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ HLPF సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
కిషన్ రెడ్డికి పర్యాటక మంత్రిగా అరుదైన గౌరవం : ఈ సమావేశాలకు ఆహ్వానం అందుకున్న మొదటి భారత పర్యాటక మంత్రిగా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు కిషన్ రెడ్డి. 'జీ-20 టూరిజం చైర్' హోదాలో ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన బోతునున్నారు కిషన్ రెడ్డి. ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, 'గోవా రోడ్‌మ్యాప్' రూపంలో భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.














Click it and Unblock the Notifications