"పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 4.30లక్షల ఇళ్లు"
ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ ఎన్నికల కోసం కాకుండా వికసిత్ భారత్- 2047 కోసం పెట్టిన బడ్జెట్ అని పేర్కొన్నారు. సుస్థిర లక్ష్యాలను ప్రజలు అందుకునే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే కేంద్ర బడ్జెట్ పై పలు రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం నిర్వహిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వీబీ జీ రామ్ జీ పథకాన్ని నిర్వీర్యం చేశారంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్ లో గతేడాది కంటే 9 శాతం అధికంగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 5 వందే భారత్, 2 అమృత్ భారత్ రైళ్లను కేటాయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న కాలంలో రూ.5.50 లక్షల కోట్లతో 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. అలాగే హైదరాబాద్- యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారని తెలిపారు. ఇక మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన రూ. 3.70 కోట్లు నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ప్రతి జిల్లాకు బాలికల వసతి గృహం రాబోతున్నట్లు వివరించారు. దాంతోపాటు హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతోందని తెలిపారు. నైనీ బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని విమర్శించారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భ్రష్టు పట్టించాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
మరోవైపు దివ్యాంగజనుల సాధికారతకు ప్రధాని తీసుకున్న చర్యలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. "దివ్యాంగజనుల సాధికారతకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. పరిశ్రమల అవసరాలకు అనుగణంగా నైపుణ్య శిక్షణ, తక్కువ ధరలో నాణ్యమైన సహాయక పరికరాలు వంటి కార్యక్రమాల ద్వారా వారి అభివృద్ధికి బాటలు వేసింది.

దివ్యాంగజన్ కౌశల్ యోజన. ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ.. దివ్యాంగ సహారా యోజ.. అందుబాటు ధరలో నాణ్యమైన సహాయక పరికరాలు.. PM దివ్యాశ కేంద్రాలు.. ఒకేచోట దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు, ఫిట్టింగ్, మరమ్మతులు, సేవలు.. ALIMCO మద్దతు.. అధునాతన సాంకేతికతలను వినియోగించి తక్కువ ధరలో అత్యాధునిక సహాయక పరికరాలను అందించడం..












Click it and Unblock the Notifications