27న కాంగ్రెస్ లోకి రాజగోపాల్ - బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం కీలక మలుపు తీసుకుంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raja Gopal Reddy) బీజేపీకి రాజీనామా చేసారు. ఈ నెల 27న కాంగ్రెస్(Congress) లో చేరటానికి ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ లో సీటు కూడా ఇప్పటికే ఖరారు చేసారు. తాను తిరిగి కాంగ్రెస్ లో చేరటానికి కారణాలను రాజగోపాల్(RajaGopal) వివరించారు. బీజేపీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అమిత్ షా కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేసారు.
బీజేపీకి రాజీనామా చేస్తూ:రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేసారు. ఈ నెల 27న కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ..ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందని చెప్పారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని వ్యాఖ్యానించారు .ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారని వివరించారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రత్యామ్నాయం:తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి బీజేపీకే ఉందని భావించి 15 నెలల క్రితం తాను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరానని వివరించారు. బీజేపీ ముఖ్యుల ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశానని పేర్కొన్నారు. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ
స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడిందని చెప్పుకొచ్చారు. అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని విశ్లేషించారు.

బీజేపీ ఎదగలేకపోయింది:అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నానని వివరించారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తనకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు చెప్పారు.
కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నట్లు రాజగోపాల్ తన లేఖలో కోరారు.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications