ప్రభుత్వ వైఫల్యాలతోనే రైతు ఆత్మహత్యలు: కోదండరాం

Subscribe to Oneindia Telugu

వరంగల్‌ : ప్రభుత్వాల వైఫల్యాతోనే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు ప్పాడుతున్నారని తెంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ నవ నిర్మాణ వేదిక ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం, కారణాలు, పరిష్కారాలు అనే అంశంపై వేదిక కన్వీనర్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వరాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతికే విధ:గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నూతన రాష్ట్రంలో రైతు ఇజ్జత్‌తో సమాజంలో నిలదొక్కుకుని ఉంటే చాలు అనే భావనతో ఉన్నారని చెప్పారు. వ్యవసాయం చేసే వారిచేతుల్లోనే భూమి ఉండాలన్నారు.

Kodandaram blames TRS regime for farmers suicides

రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొంటోందని ధ్వజమెత్తారు. అసైన్డ్‌ భూములనూ అసలుదారులను పేరుతో బెదిరించి అక్రమంగా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తున్నారన్నారు. రాష్ట్ర భూమి వినియోగానికి స్పష్టమైన విధానం లేదన్నారు. ఆంధ్రా కంట్రాక్టర్లకు పనులను అప్పగించి నిధులను దొచిపెడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల్లో పూడిక తీస్తుంటే నీళ్లను ఆపే పొర పోవడంతో చెరువుల్లో నీరు నిలువకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన పనుల్లో రూ. 1కి 40 పైస మేరనే లభ్ది చేకూరుతోందని, మిగతాది కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తొందని ఆరోపించారు.

న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత నున్నా అప్పారావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతా ప్రజలపై ప్రభుత్వం ధ్వంద్వ విధానం అవంభిస్తోందని ధ్వజమెత్తారు. కేయూ ప్రొఫెసర్‌ కూరాపటి వెంకటనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసి చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.

KCR Government Cheats sheep farmers

కార్యక్రమంలో వివిధ సంఘా ప్రతినిధు బొట్ట బిక్షపతి, జగదీశ్వర్‌, బార్‌ వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిల్లా రాజేంద్రప్రసాద్‌, అంబాడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana political JAC chairman Kodandaram blamed CM K Chandrasekhar Rao's regime for farmers suicides.
Please Wait while comments are loading...