Kodandaram: కాళేశ్వరంతో లక్షల కోట్లు దుర్వినియోగం.. కోదండరాం ఆవేదన..
ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరం, సీఎం కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్నాయని టీజేఎస్ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని ప్రజలను కోరారు. కోదండరాం బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పర్యటించారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ, తెలంగాణ సమాఖ్య-జాగో తెలంగాణ, భారత్ బచావో సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
1200 మంది బిడ్డల ప్రాణ త్యాగలతో వచ్చిన తెలంగాణ ఈ రోజు కేసీఆర్ కుటుంబ పాలనలో బంధి అయిపోయిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ సరిగా లేదని చెప్పినందుకే తనపై కక్ష సాధించారని గుర్తు చేశారు. పనిరాని పథకాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.30 కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.50 లక్షల కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటుందని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా పదేళ్లుగా నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలపై ఒక్కమాట కూడా మాట్లాడని మంత్రి కేటీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు వేస్తామనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే మరో ఐదేళ్లు తిప్పలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, నిరూప్, గోపీనాథ్, సీనియర్ జర్నలిస్టు యాదగిరి, ఝాన్సీరెడ్డి హాజరయ్యారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications