ఈ తెలంగాణ వద్దు: కేసీఆర్‌కు కోదండ మళ్లీ షాక్, టిఆర్ఎస్ స్పందించేనా?
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెరాస పాలన పైన మంగళవారం నాడు మరోసారి మండిపడ్డరు. ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చిందని, కానీ కాంట్రాక్టర్లు, రియాల్టర్లకు లబ్ధి చేసే తెలంగాణ వద్దని కోదండ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కోదండరాంకు కౌంటర్, తలసాని ఎఫెక్ట్: టిఆర్ఎస్‌లో భిన్నరాగం?
తెలంగాణ అభివృద్ధి కోసం సంఘటితంగా పని చేస్తామని కోదండరాం అన్నారు. జేఏసీ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ అయిదో వర్ధంతి వేడుక జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. జయశంకర్ లేకపోవడం సమాజానికి తీరని లోటు అన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో కోదండరామ్ తెరాస ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసింతే. చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని కోదండరామ్ గతంలో వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచారు. తాజాగా, జయశంకర్ వర్ధంతి సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్‌పై కోదండ ఫైట్: విపక్షాల ఎజెండా గల్లంతు?
కోదండ వ్యాఖ్యల పైన స్పందించవద్దని కేసీఆర్ ఆదేశించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు తెరాస నేతలు స్పందిస్తారా లేదా చూడాల్సి ఉంది.
తెరాసలో ప్రకంపనలు, కోదండకు మద్దతు: కేసీఆర్ ఆలస్యంగా మేల్కొన్నారా?
గత రెండేళ్లుగా కేసీఆర్ పాలనకు తిరుగు లేకుండా పోయింది. విపక్షాల ఉనికే కనిపించని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోదండరామ్ ఇటీవల తెరపైకి వచ్చారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తద్వారా కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోగల సత్తా కోదండకు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విపక్షాలు కూడా ఆయనకు అండగా నిలబడుతున్నాయి.
మరోవైపు, కేసీఆర్ కూడా జయశంకర్ వర్ధంతి నేపథ్యంలో ఆయనను సేవల్ని స్మరించుకున్నారు. తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆయన భావజాలమే నేడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపకరించిందన్నారు. జయశంకర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధన దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications