కేసీఆర్‌కు మళ్లీ కోదండరాం చురక, 'దమ్ముంటే రండి' (పిక్చర్స్)

హైదరాబాద్: మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ మరోసారి చురకలు అంటించారు. నిర్వాసితులకు పరిహారం తగ్గించడం కాదని, ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని హితవు పలికారు.

మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు పరిహారమే ప్రాతిపదిక కాకుండా 2013 చట్టం ప్రకారం సాధ్యమైనంత వరకు ముంపు తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందన్నారు. నిర్వాసితుల్లో అవగాహన పెంచడానికి జూలై 5న ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిపుణులతో సదస్సు నిర్వహిస్తామన్నారు.

కోదండరామ్

కోదండరామ్

పునరావాసం జీవో 123 ప్రకారమా లేదా 2013 చట్టం ప్రకారమా? అనే వివాదాలు కాకుండా, సాధ్యమైనంత వరకు ముంపు తగ్గించి ప్రత్యామ్నాయాలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు ముందుగా డీపీఆర్‌లను బయటపెట్టి చర్చద్వారా భూసేకరణ చేపడితే బాగుండేదన్నారు.

కోదండరామ్

కోదండరామ్

ఏపీకి పంపిన తెలంగాణ ఉద్యోగులను తక్షణం వెనక్కి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన ప్రక్రియను కోరుతూ ఆందోళన చేస్తున్న న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు, న్యాయాధికారులు ఆందోళనకు మద్దతు ప్రకటించారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రజలను ముంచే యత్నాలకే వ్యతిరేకమని కాంగ్రెస్ నేతలు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలు అన్నారు. రైతులుక మేలు చేసేందుకే తమ పోరాటం అన్నారు. పులిచింతల ప్రాజెక్టులో రైతులకు అద్భుత ప్యాకేజీ ఇచ్చామని, కాదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఉత్తమ్ సవాల్ విసిరారు. దమ్ముంటే మీరు మల్లన్న సాగర్ రావాలన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

2013 చట్టంతోనే మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులకు మేలు జరుగుతుందని జానా రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే తమకేదో లబ్ధి చేకూరుతుందని ఆశించిన ప్రజలు, ఉన్న ఊరు, గూడు చెదిరి పోతోంటే తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఎల్ రమణ

ఎల్ రమణ

సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే మల్లన్నసాగర్‌ ముంపు బాధిత రైతులు తొలి తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ వ్యాఖ్యానించారు. భూసేకరణలో కేసీఆర్‌ అహంకారం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రెండు చట్టాల్లో ఏ చట్టం కావాలంటే దానిని అమలు చేస్తామని సీఎం చెప్పడం గందరగోళం సృష్టించడానికేనన్నారు. కేసీఆర్‌ ఎంపీగా ఉన్నప్పుడే (2013లో) కేంద్రం తెచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ ధరకు ఐదు రెట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+