రేవంత్ తో వెంకన్న రాజీ - ఢిల్లీలోనే ఆ ఇద్దరు, తెరవెనుక..!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమవుతోంది. సీనియర్లు సీఎం సీటు కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. రేవంత్ తో తొలి నుంచి విభేదిస్తున్న సీనియర్లు ఇప్పుడు పార్టీ హైకమాండ్ మూడ్ స్పష్టం కావటంతో స్పీడ్ తగ్గించారు. రేవంత్ ను తొలుత వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అభినందనలు తెలిపారు. ఇక..ఉత్తమ్, భట్టి ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ - ప్రభుత్వం లో ప్రాధాన్యత గురించి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

మారుతున్న లెక్కలు : తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ ను పీసీసీ చీఫ్ పదవి సమయం నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అభినందించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మోనార్క్ ప్రభుత్వాన్ని దింపి తిరిగి ప్రజాస్వామ్య పాలన వస్తుందని ట్వీట్ చేసారు. రేవంత్ కు కంట్రాట్స్ బ్రదర్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

Komatireddy congratulates Revanth Reddy, says democratic rule back in Telangana

ఇక..మంత్రి పదవి పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి ఎవరు కోరుకోరంటూ..పరోక్షంగా తన మంత్రి పదవి గురించి ప్రస్తావించారు. కోమటిరెడ్డి గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఈ సారి రేవంత్ మంత్రివర్గంలో కోమటిరెడ్డికి ఐటీ, మున్సిపల్ శాఖ ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, కేటీఆర్ కు గుర్తింపు తెచ్చిన ఐటీ శాఖ ఇప్పుడు ఎవరికి వచ్చినా సవాల్ గా మారనుంది.

సీనియర్లకు హామీలు: ఇక, చివరి వరకు సీఎం రేసులో ఉన్న నేతలు ఒక్కొక్కరూ దిగి వస్తున్నారు. సీనియర్ నేత శ్రీధర్ బాబు సైతం పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేసారు. పార్టీలో ఎవరైనా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక..సీఎం రేసులో చివరి వరకు నిలిచిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్ తో మంతనాలు కొనసాగిస్తున్నారు.

సీఎం పదవి లేకపోవటంతో పార్టీ - ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భట్టికి డిప్యూటీ సీఎం పదవి ఖరారైంది. అయితే, ఎస్టీ మహిళ కు మరో డిప్యూటీ సీఎం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పార్టీలో కీలక పదవి కోరుతున్నట్లు సమాచారం.

రేవంత్ కు సూచనలు : మరో నేత ఉత్తమ్ పార్టీ నిర్ణయం పైన బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా..లోలోపల మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తమ్ కు స్పీకర్ లేదా ఆర్దిక శాఖ పైన చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అయితే సీఎం రెడ్డి వర్గానికి ఇవ్వటంతో అదే వర్గానికి చెందిన ఉత్తమ్ కు స్పీకర్ దక్కటం పైన సందేహాలు ఉన్నాయి. దీంతో..ఆర్దిక లేదా రెవిన్యూ శాఖను ఉత్తమ్ కు కేటాయిస్తారని చెబుతున్నారు. అయితే, ఢిల్లీ లోనే రేవంత్ తో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యేలా సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే సీనియర్లను కలుపుకొని వెళ్లేలా హైకమాండ్ రేవంత్ కు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+