కోమటిరెడ్డి.. ఘర్ వాపసీ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేసీఆర్ సుడిగాలి పర్యటలను చేస్తోన్నారు. నేడు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పాలేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అటు కాంగ్రెస్, బీజేపీ.. తమ ప్రచార కార్యక్రమాలను తీవ్రతరం చేశాయి. బస్సు యాత్రలను నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే తొలి విడత బస్సు యాత్ర పూర్తయింది. శనివారం నుంచి రెండో విడత బస్సు యాత్ర మొదలు కానుంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ సీనియర్లు ఇందులో పాల్గొననున్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఘర్ వాపసీ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి సొంతగూటికి తిరిగొచ్చారు. మునుగోడు శాసన సభ్యుడిగా ఉన్న ఆయన బీజేపీలో చేరారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్‌కు చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు.
ఈ ఓటమి తరువాత ఆయన మళ్లీ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గురువారం రాత్రి దేశ రాజధానిలో కాంగ్రెెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు.
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి pic.twitter.com/qF2oxwWjo6
— oneindiatelugu (@oneindiatelugu) October 27, 2023
గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు ఏనుగు రవీందర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి టికెట్ దక్కలేదు. దీనితో పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. కోమటిరెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఆ సమయంలో వారి వెంట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications