వైఎస్సార్ రాజ్యం తీసుకొస్తాం, వారిని చూస్తూ ఊరుకోం- రాజగోపాల్ రెడ్డి సంచలనం..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఢిల్లీలో కొండా సురేఖ అంశం సంచలనంగా మారింది. హైకమాండ్ తో సీఎం రేవంత్ చర్చల వేళ... సురేఖ మరోసారి ముఖ్యమంత్రి లక్ష్యం గా కీలక వ్యాఖ్యలు చేసారు తన పైన చర్యలు తీసుకునే ముందు రేవంత్ పైన చర్యలు ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కీలక ప్రకటనతో పార్టీలో చర్చకు కారణమయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తెలంగాణ పరిణామాల పైన చర్చలు.. సమావేశాలు కొనసాగుతున్నాయి. కొండా సురేఖ పైన చర్యల విషయంలో పార్టీ ముఖ్య నేతలతో అభిప్రాయాల సేకరణ కొనసాగుతోంది. ఇదే సమయంలో మరోసారి సీఎం రేవంత్ లక్ష్యంగా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పైన చర్యలకు ముందే రేవంత్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కాగా, ఇటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తెలంగాణలో మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం తీసుకొస్తామని ప్రకటించారు. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక
అదే విధంగా వైఎస్ఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. తాను వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడుతానని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వైఎస్సార్ శిష్యులం, తామ ఆయనను మరవం అని స్పష్టం చేశారు. తనను సీఎం.. సీఎం అంటున్నారు. ఆ టైం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడన్నారు. కొత్తవాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తే రాజగోపాల్ రెడ్డి ఊరుకోడని హెచ్చరించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగనీయనన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదే అయినప్పటికీ తమనే వెలగొడతాం అంటే ఊరుకోమన్నారు. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమే అంటూ ఆసక్తి పెంచారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త లకు అన్యాయం జరిగితే వాళ్ల తరుపున రాజగోపాల్ రెడ్డి పోరాడుతాడనంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications