వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకటరెడ్డి నిర్ణయం తీసుకుంటారు - సీఎంను రప్పిస్తున్నాను : రాజగోపాల్..!!

|
Google Oneindia TeluguNews

తాను చేసిన రాజీనామాతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ తరువాతనే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారని.. ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. మునుగోడు నియోజకవర్గంకు ముఖ్యమంత్రిని రప్పిస్తున్న ఘనత తనదేనని చెప్పారు. మునుగోడు సభ నుండి రాజగోపాల్ రెడ్డిపై ముఖ్యమంత్రి, ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మరని రాజగోపాల్ వ్యాఖ్యానించారు.

రాజీనామాతో కేసీఆర్ వస్తున్నారు

రాజీనామాతో కేసీఆర్ వస్తున్నారు

ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే లను ప్రభుత్వం అణిచివేస్తుందన్నారు. కాంట్రాక్టు లకోసం రాజీనామా చేయలేదని వివరించారు. అలా కావాలని తాను భావిస్తే 12 మందితో కలిసి పార్టీ మారేవాడినని పేర్కొన్నారు. ప్రజల నిర్ణయం మేరకే..నిజాయితీగా రాజీనామా చేసి..ఆమోదింపచేసుకున్నానని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని సర్పంచ్ లకు ఫోన్లు చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. మునుగోడు పైన ఇప్పటి వరకు స్పందించని సీఎం కేసీఆర్..ఇప్పుడు మనుగోడు వస్తున్నారని ధ్వజమెత్తారు.

Recommended Video

Munugodu లో Congress అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే *Telangana | Telugu OneIndia
తెలంగాణలో శ్రీలంక తరహా పరిస్థితులు

తెలంగాణలో శ్రీలంక తరహా పరిస్థితులు


ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. జిల్లా మంత్రి కల్యాణ లక్ష్మీ చెక్కులు ఇవ్వడానికి పరిమితం అయ్యారని ఎద్దేవా చేసారు. మునుగోడు ప్రజలు తనను కాపాడుకుంటారని..కడుపులో పెట్టుకుంటారని రాజగోపాల్ చెప్పారు. ఉప ఎన్నికల్లో తీర్పు తెలంగాణలో చరిత్రకు కారణమవుతుందని వివరించారు. అధికార పార్టీ నుంచి నేతలంతా డబ్బు సంచీలతో వస్తారని ఆరోపించారు. తెలంగాణ ఆర్దిక పరిస్థితి బాగోలేదని.. శ్రీలంక తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఉద్యోగులకు అప్పు చేస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు.

మునుగోడులో భారీ బహిరంగ సభ

మునుగోడులో భారీ బహిరంగ సభ


కుటుంబ పాలనకు, అరాచక పాలనకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తుంటే.. తనతో ప్రజలు కలిసి వస్తున్నారని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను వ్యక్తిగతంగా దెబ్బ తీయటానికి ఉప ఎన్నిక రాలేదన్నారు. 21న భారీ బహిరంగ ఏర్పాటు చేసామని..అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని రాజగోపాల్ వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో రాష్ట్రాన్ని కాపాడేది బీజేపినే అని పేర్కొన్నారు. తాను అమ్ముడుపోయాయని అంటున్న వారికి నిరూపించమని సవాల్ చేస్తే.. స్పందన లేదని రాజగోపాల్ చెప్పుకొచ్చారు.

English summary
Komatireddy Rajagopal Reddy says enkata Reddy will take key decision shortly, BJP organising huge public meeting in munugodu on 21st of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X