వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌ను మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు తీసుకొచ్చా: రాజగోపాల్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 13 రౌండ్లలో టీఆర్ఎస్ లీడ్ ఉంది. మరో రెండు రౌండ్లు ఉన్నా.. రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి.. ఓటమిని అంగీకరించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం దుర్వినియోగం చేసిందని విరుచుకుపడ్డారు. కనీసం తనను ప్రచారం చేయనీయకుండా అడ్డుకుందని మండిపడ్డారు. ఆ పార్టీ అధర్మంగా గెలిచినట్టేనని.. నైతికంగా మాత్రం తానే గెలిచానని తెలిపారు.

ఏకపక్షంగా వ్యవహరించి

ఏకపక్షంగా వ్యవహరించి

దేశ చరిత్రలో రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేయలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒత్తిడి తీసుకువచ్చి.. తప్పులు చేయించి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నిక జరిగిన 3వ తేదీ సాయంత్రం వరకు మనుగోడులో ఉన్నారని ఆరోపించారు.

అష్టదిగ్బందనం చేసి..

అష్టదిగ్బందనం చేసి..

తమను, నేతలను అష్టదిగ్బందనం చేశారని ఆరోపించారు. గ్రామానికి ఎమ్మెల్యే, మండలానికో మంత్రిని కేటాయించారని పైరయ్యారు. మొత్తం అసెంబ్లీ మునుగోడుకు తీసుకొచ్చానని వివరించారు. అంత ఎందుకు సింబల్ కూడా సరిగా కేటాయించలేదన్నారు. 31వ తేదీ వరకు అంతా బాగుందన్నారు. 1వ తేదీ నుంచి సిచుయేషన్ మారిందని తెలిపారు. బెదిరించి, భయపెట్టి, డబ్బులు పంచి గెలిచారని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన ఏజెంట్లప కూడా దుర్మార్గంగా వ్యవహరించారని తెలిపారు.

కౌరవ సైన్యం మొహరింపు

కౌరవ సైన్యం మొహరింపు

ఒక వ్యక్తిని ఓడిగొట్టేందుకు.. కౌరవ సైన్యం మొహరించారని తెలిపారు. అంతకుముందే పోస్టింగ్స్ ఇచ్చారని.. ప్రలోభాలు పెట్టి, బెదిరించారని తెలిపారు. నిజానికి డెవలప్ చేసినా.. లైఫ్ మారిన ఇంత మంది అవసరం లేదన్నారు.ప్రలోభాల వల్ల, ఒత్తిడి వల్ల.. అధర్మంగా గెలిచారని తెలిపారు. గొల్ల కురుమలకు.. గొర్రెలు పంపిణీ చేసి లిటిగేషన్ పెట్టారని తెలిపారు. అకౌంట్ లో పైసలు వేసి.. లాక్ చేశారు. ఓటు వేయకుంటే తీసుకుంటాం అని చెప్పడంతో వేశారని తెలిపారు. మరొకొందరినీ పెన్షన్.. కట్ అవుతుందని చెప్పారని.. ఇందుకు జగదీశ్ రెడ్డిపై ఈసీ నిషేధం ఉదహరణ అని చెప్పారు.

నంబర్ గేమ్ మాత్రమే

నంబర్ గేమ్ మాత్రమే

ఇదీ నెంబర్ గేమ్ మాత్రమే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఫామ్ హౌన్, ప్రగతి భవన్‌ను మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు తీసుకొచ్చా అని తెలిపారు. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా ఉన్న తెలంగాణ విముక్తి కోసం పోరాడుతానని తెలిపారు. అధర్మంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొన్నారని వివరించారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్ముకు.. కమ్యూనిస్టులు అమ్ముడు బోయారని హాట్ కామెంట్స్ చేశారు.

English summary
bjp candidate komatireddy rajagopal reddy agree to defeat in munugodu by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X