రేవంత్ వెనుక ఆంధ్రా పెట్టుబడిదారులు.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
Komatireddy Rajagopal Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వెనుక 20 మంది ఆంధ్రా పెట్టుబడిదారులు ఉన్నారని, వారంతా తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే వారి బండారం బయటపెడతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాటతీరు, పనితీరుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
"సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి.. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి.. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు.. నాకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది.. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదు.. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది." అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. "సీఎం రేవంత్ తన భాష, హావభావాలు మార్చుకోవాలి. ఆయన గంటల తరబడి మాట్లాడకుండా, ఆ శ్రద్ధను పని మీద చూపించాలి. ఆవేశం పనిచేయదు, కూల్ మైండ్‌తో పనిచేయాలి" అని సూచించారు. ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతూ, "ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం మరియు ప్రజలు నిర్ణయిస్తారు" అని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.

మంత్రి పదవి, కాంగ్రెస్ ఐక్యతపై వ్యాఖ్యలు
మంత్రి పదవి విషయంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ విషయం తెలియదని ఆయన అన్నారు. "అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది" అని పేర్కొంటూ, పార్టీలో ఐక్యత అవసరాన్ని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలను నిందించడం మానేసి, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వా బోడ మల్లన్న అన్నట్లు సీఎం రేవంత్ వైఖరి ఉందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడిన సంగతి తెలిసిందే. ఆ విషయంలోనే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. తాజాగా మరోసారి టార్గెట్ చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ ఉందని తెలిపారు. అసెంబ్లీకి రాని కేసీఆర్.. ముందుగా తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలన్నారు.
Komatireddy Rajagopal Reddy makes sensational allegations against Revanth Reddy
— Akshay (@AkshayBRS) August 6, 2025
There are 20 Andhra investors behind Revanth Reddy
They are all looting Telangana's wealth pic.twitter.com/BIWSXGHE0f












Click it and Unblock the Notifications