బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను: బండి సంజయ్ తొలగింపుపై కోమటిరెడ్డి రాజగోపాల్ భావోద్వేగం
హైదరాబాద్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సందర్భంలో తాను తీవ్ర ఆవేదనకు గురైనట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయడంతో బీజేపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడనున్న నేతలను ఆశ్చర్యానికి గురి చేశాయి.

బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సమయంలో.. ఆయనను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆ సమయంలో బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బండి సంజయ్ రాజీలేని పోరాటం చేసి పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి అన్నారు. బండి సంజయ్ విషయంలో తనకు బాధ కలిగిందని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ అధ్యక్షుడుగా రాజీ లేనీ పోరాటం చేసిన నాయకుడు పునరుద్ఘాటించారు.
అయితే, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామన్నారు రాజగోపాల్. నాయకుల్లో, శ్రేణుల్లో జోష్ నింపింది బండి సంజయ్ మాత్రమేనని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమించిన బండి సంజయ్‌ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. కాగా, రాజగోపాల్ రెడ్డి.. బండి సంజయ్ పేరును ప్రస్తావించగానే సభా ప్రాంగణంలో ఒక్కసారిగా చప్పట్లు, షర్షధ్వనాలు మారుమోగాయి.
Komatireddy Rajgopal's emotional farewell address for Bandi Sanjay, the outgoing BJP state president. #Telangana pic.twitter.com/1siacaZiyu
— GappaTG™ 🦜 (@GappaTG) July 21, 2023
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నైతికంగా గెలిచిందని కోమటిరెడ్డి తెలిపారు. దేశంలో ప్రధాని మోcwకి సరిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కొంత కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకేటనని ప్రచారం జరుగుతుందని.. అలాంటివి ఆరోపణలు మాత్రమే అందులో నిజం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పని చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ని అధికారం నుంచి దించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications