కాంగ్రెస్ కు బిగ్ షాక్.. రాజీనామాకు సిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ?
తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని.. అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కావాలా..?మునుగోడు ప్రజలు కావాలా..? అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని అన్నారు. ఈ మేరకు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు.
ప్రజల కోసం మళ్లీ పదవీ త్యాగానికి సిద్ధం అయినట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చానని గుర్తుచేశారు. మంత్రి పదవి ఇస్తామంటేనే కాంగ్రెస్ లోకి వచ్చినట్లు తెలిపారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వారి విజ్ఞత అని స్పష్టం చేశారు. మంత్రి పదవి కావాలా..?మునుగోడు ప్రజలు కావాలా..? అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని అన్నారు. ఈ మేరకు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని.. కానీ.. నియోజకవర్గ ప్రజల కోసం మునుగోడు నుంచి పోటీ చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
"మంత్రి పదవిని నా స్వార్థం కోసం అడగటం లేదు. మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు. భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. పదవి ఇస్తారా..? ఇవ్వరా..? అనేది పార్టీ అధిష్ఠానం ఇష్టం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు, నా జూనియర్లకు కూడా ఇచ్చారు. ఎవరి కాళ్లో మొక్కి పదవి తెచ్చుకోవాలని అనుకోవడం లేదు. దిగజారి బతకడం తెలియదు. మళ్లీ త్యాగానికైనా సిద్ధం. ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్తా. నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను.. అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. గత కొన్ని రోజులుగా పార్టీపై ఆగ్రహంతో ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అనడంపై.. ఇలా చెప్పుకోవడం కాంగ్రెస్ విధానం కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియా జర్నలిస్టులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇది కరెక్ట్ కాదంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications