వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సస్ రాజగోపాల్ : మునుగోడు వేదికగా - ప్రచారానికి సిద్దం..!!

|
Google Oneindia TeluguNews

మునుగోడులో ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి ముందుకొచ్చారు. అదే సమయంలో కండీషన్లు పెట్టారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలు ఖరారయ్యాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ నెల 22 నుంచి మునుగోడులో పర్యటించనున్నారు. ఇక, రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి

రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి

దీనికి అంగీకరించిన రేవంత్.. వెంకటరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసారు. అదే విధంగా తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాలని వెంకటరెడ్డి డిమాండ్ చేసారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పైన కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు గళం విప్పుతున్నారు. రేవంత్ వ్యవహారం పైన నేరుగా సోనియాతో మాట్లాడే బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నారు. ఇదే సమయంలో మరో కీలక అంశం వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి సిద్దమని వెంకటరెడ్డి స్పష్టం చేసారు.

ప్రచారానికి వెళ్తానంటూ

ప్రచారానికి వెళ్తానంటూ


అయితే, తనకు స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. గతంలోనే తాను చౌటుప్పల్ , గుడిమల్కాపురం రోడ్డును వేయాలని అడిగిన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తు చేస్తున్నారు. అప్పుడు పట్టించుకోలేదని..ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే కారణంగా హడావిడిగా రోడ్లు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు దక్షిణ తెలంగాణపై ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. 350 కోట్లతో పిలాయిపల్లి కాలువ ప్రారంభిస్తానని... చెప్పి అందులో 50 కోట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మింగారని ఆరోపించారు.

అటు రేవంత్ పై ఫిర్యాదు దిశగా

అటు రేవంత్ పై ఫిర్యాదు దిశగా


గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో, 20వేల డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తే మునుగోడులో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. మునుగోడు ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేదా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే, అనూహ్యంగా పార్టీ వీడే నేతలు.. టార్గెట్ రేవంత్ రాజకీయాలతో మునుగోడు కంటే వీటి పై ఎక్కువగా చర్చ కంటిన్యూ అవుతోంది. ఇక... ఇప్పుడు వెంకటరెడ్డి నిజంగా మునుగోడులో పార్టీ తరపున ప్రచారం చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

English summary
MP Komatireddy Venkatreddy came forward for campagin for party in Munugody by poll against his brother Rajagopal Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X