కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు, తిరిగి కేబినెట్ హోదా - అనూహ్య మలుపు..!!
కొండా సురేఖ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. మంత్రిగా బర్తరఫ్ తరువాత కొండా సురేఖ మౌనంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కొండా మౌనం వెనుక వ్యూహం పైన చర్చలు సాగుతున్నాయి. పార్టీ నేతలు సురేఖతో దూరంగానే ఉంటున్నారు. ఈ సమయంలోనే నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగింది. ఢిల్లీ రావాల్సిందిగా సూచన చేసారు. సురేఖ కు కీలక పదవి దక్కనున్నట్లు పార్టీ నతేల సమాచారం.
కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసు కొంటున్నాయి. సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో మొదలైన వివాదం చివరకు మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయటం వరకు వెళ్లింది. ఢిల్లీలో పార్టీ చీఫ్ ఖర్గేను సురేఖ కలిసారు. తన వాదన వినిపించారు. అయితే, వారి మూడ్ స్పష్టం కావటంతో ఢిల్లీ వేదికగానే సురేఖ నేరుగా సీఎం రేవంత్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తన కంటే ముందు రేవంత్ పైన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేసారు. బీసీ కార్డును తెర మీదకు తెచ్చారు. ఆ సమయంలోనే కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని రేవంత్ పట్టుబట్టటంతో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సురేఖ పైన మంత్రివర్గం నుంచి వేటు వేస్తూనే.. ముగ్గురు మహిళలకు పదవులు కేటాయించారు. కాగా.. సురేఖ ఇక పార్టీ వీడుతారనే ప్రచారమూ సాగింది.

మద్దతు దారులతో కొొండా సమావేశం
అయితే, సురేఖ తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇతర పార్టీ ల నేతలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాజీ మంత్రి కొండా సురేఖకు స్వయంగా ఫోన్ చేసారు. ఢిల్లీకి రావాలని హైకమాండ్ పిలుపు అందింది. ఈ అంశంపై చర్చించడానికి కొండా సురేఖ ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా రావాలని కొండా మురళి ముఖ్య కార్యకర్తలందరికీ ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. కార్యకర్తలతో భేటీ అనంతరం ఢిల్లీ పెద్దలతో సురేఖ మాట్లాడనున్నారని, ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. సురేఖకు క్యాబినెట్ స్థాయి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో.. సురేఖ విషయంలో ఇప్పుడు పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం.. రేవంత్ స్పందన రాజకీయంగా ఆసక్తిగా మారుతున్నాయి.













Click it and Unblock the Notifications
