నేను మాట్లాడితే మా అమ్మను బలి చేస్తారనుకోలేదు: వెక్కి వెక్కి ఏడ్చిన కొండా సుస్మిత

తెలంగాణా రాష్ట్రంలో కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను అత్యంత అవమానకరంగా , అనూహ్యంగా బర్తరఫ్ చేసిన సంఘటనపై ఆమె కుమార్తె కొండా సుస్మిత పటేల్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె బోరున ఏడుస్తూ తన అమ్మను రాజకీయంగా బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను మాట్లాడితే మా అమ్మను బలి చేస్తారా?" కొండా సుస్మిత కన్నీటి పర్యంతం

"నేను మాట్లాడితే మా అమ్మను బలి చేస్తారా?" అంటూ సుస్మిత కన్నీటిపర్యంతమయ్యారు. దీనిని తాను ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నానని, తన తల్లి చాలా సిన్సియర్ గా తన పని తాను చేసుకునే పొలిటీషియన్ అని అన్నారు. కొండా సురేఖ ఎంపీపీ స్థాయి నుంచి అంచెలంచెలుగా కష్టపడి ప్రజా నాయకురాలిగా ఎదిగారని, ఆమె నిర్వహించిన శాఖలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టం చేశారు.

Konda Susmitha breaks down over mother Konda Surekha cabinet exit alleging personal vendetta by CM Revanth

కొన్ని రోజులుగా తిండి తినలేక, నిద్రపోలేక బాధపడుతున్నా: కొండా సుస్మిత

అయినా కేబినెట్ నుంచి తొలగించడం తీవ్రమైన దెబ్బ అని, గత కొన్ని రోజులుగా తిండి తినలేక, నిద్రపోలేక బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు.ఇది తన తల్లిపై కక్ష పూరితంగా జరిగిన చర్యగా ఆమె పేర్కొన్నారు. తాను పార్టీని కానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కానీ ఒక్క మాట కూడా అనలేదన్నారు. కేవలం తాను ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబ రాజకీయాలను మాత్రమే టార్గెట్ చేశానని చెప్పారు.

రేవంత్ కు మొదటి నుండే తన తల్లిపై వ్యక్తిగత కక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచే తమ తల్లిపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని, ఆ కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తాను గతంలో మాట్లాడినప్పుడు కూడా కేవలం ఒక వ్యక్తి ప్రవర్తన గురించి మాత్రమే ప్రస్తావించానని, కాంగ్రెస్ పార్టీపై గానీ, పార్టీ వ్యతిరేకంగా గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

బీజేపీ నుండి కొండా సురేఖకు ఊహించని షాక్.. బీజేపీ డంపింగ్ బిన్ కాదు!
బీజేపీ నుండి కొండా సురేఖకు ఊహించని షాక్.. బీజేపీ డంపింగ్ బిన్ కాదు!

రాజకీయ ప్రతీకార చర్యలు దారుణమని ఏడ్చిన సుస్మిత

స్వయం కృషితో ఎదిగిన సీనియర్ బీసీ మహిళా నాయకురాలిపై ఇలాంటి రాజకీయ ప్రతీకార చర్యలు దారుణమని, అధిష్ఠానం వద్ద తమపై కావాలనే దుష్ప్రచారం జరిగిందని సుస్మిత ఆవేదన చెందారు. తల్లి గౌరవం కోసం పోరాడుతానని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యవహారం, ఈ అవమానం తాను వదిలిపెట్టబోనని కొండా సుస్మిత పేర్కొన్నారు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+