బీజేపీ నుండి కొండా సురేఖకు ఊహించని షాక్.. బీజేపీ డంపింగ్ బిన్ కాదు!

తెలంగాణా రాష్ట్రంలో మాజీమంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. మాజీ మంత్రి కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగించబడిన తర్వాత ఆమె బీజేపీలో చేరనున్నారని ఆమెపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటె కొండా సురేఖ విషయంలో బీజేపీలో కొందరు నాయకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమె పట్ల సానుభూతిని ప్రకటిస్తున్నారు.

బీజేపీలో కొండా సురేఖ చేరికపై మురళీధర్ రావు చెప్పిందిదే

ఇక ఇదే సురేఖ బీజేపీలో చేరుతారు అన్న వార్తలకు ఊతం ఇస్తుంది. తాజాగా మంత్రి కొండా సురేఖ బీజేపీ చేరతారు అని వస్తున్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత పి. మురళీధర్ రావు స్పందించారు. ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోబోమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే బిన్ కాదు అని మురళీధర్ రావు అన్నారు. చెత్తను పోగేసుకోలేమని ఆయన చెప్పకనే తన వ్యాఖ్యల ద్వారా కొండా సురేఖ మీద అభిప్రాయం వ్యక్తం చేశారు.

shock for konda surekha BJP Muralidhar Rao shocking reaction on Konda Surekha joining BJP

కొండా సురేఖ చేరికపై వస్తున్న ప్రచారం వెనుక రాజకీయ కారణాలు

ఇతర పార్టీల నుంచి బహిష్కృతులైన నేతలను తీసుకునే చోటు బీజేపీ కాదని ఆయన స్పష్టం చేశారు. కొండా సురేఖ చేరికపై వస్తున్న ప్రచారం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొంది. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కథనాలను ప్రచారంలోకి తెస్తున్నారని మురళీధర్ రావు విమర్శించారు.

బీజేపీలో కొండా సురేఖను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గం

ఇటీవల కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరుతారన్న పుకార్లు బలంగా వ్యాపించాయి. అయితే బీజేపీ నేతలు ఇప్పటివరకు ఆమెను ఆహ్వానించే ప్రసక్తి లేదని చెబుతున్నారు. మురళీధర్ రావు వ్యాఖ్యలతో బీజేపీలో కొండా సురేఖను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గం ఉందని తెలుస్తుంది.

NH-563 కరీంనగర్ వరంగల్ మధ్య NH-563పై సంతోషకరమైన అప్డేట్!
NH-563 కరీంనగర్ వరంగల్ మధ్య NH-563పై సంతోషకరమైన అప్డేట్!

బీజేపీ డంపింగ్ బిన్ కాదని చెప్పటం కొండా సురేఖకు షాక్

పార్టీలోకి వచ్చే వారిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తామని, బీజేపీ అంతే డంపింగ్ బిన్ కాదని చెప్పటం కొండా సురేఖకు షాక్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+