జనసేన వైపు కొండా సుస్మిత చూపు.. హైకమాండ్ ఆ పని చేస్తే!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంలో మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం, దానికి తన కూతురు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పటం, ఆపై తనపై కుట్ర జరుగుతోందని లేఖ రాయటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకుంటే వాట్ నెక్స్ట్

ఇక ఇదే సమయంలో కొండా సురేఖపై అసమ్మతి వర్గం గళం విప్పింది, ఆమెను మంత్రిగా బర్తరఫ్ చెయ్యాలని దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆమెను టార్గెట్ చేశారు.ఇక పీసీసీ ఈ మేరకు కొండా సురేఖ తీరుపై నివేదికను ఏఐసీసీకి ఇచ్చింది. దీనిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీ ఒకవేళ ఏదైనా జరిగితే వాట్ నెక్స్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు.

konda susmitha into janasena Konda Sushmitha going to meet Janasena leaders today plan to join

జనసేన నేతలతో కొండ సుస్మిత చర్చలు

అయితే ఈ క్రమంలో కొండా సుస్మిత వేగంగా పావులు కదుపుతున్నారు.ఆమె జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు నేడు జనసేన పార్టీ కీలక నేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ నేత నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో పరకాల అసెంబ్లీ టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ పగ్గాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.

కొండా సురేఖపై చర్య తీసుకుంటే జనసేన బాట పడతారా? చర్చ

కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుంటే జనసేనలోకి వెళ్లే ఆలోచనలో కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చర్యలు జరగకపోయినా సుస్మిత మాత్రం జనసేనలో కీలక బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్‌ను సందర్శించడం, పవన్ కళ్యాణ్ కు ప్రజలలో ఉన్న క్రేజ్, వీరిని జనసేన వైపు చూసేలా చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

కొండా సురేఖపై అధిష్టానానికి నివేదికలో కీలక అంశాలివే!
కొండా సురేఖపై అధిష్టానానికి నివేదికలో కీలక అంశాలివే!

ఈ కారణాలతో జనసేన వైపు సుస్మిత అడుగులు

ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్న అభిమానుల మద్దతు, పార్టీలో చేరేందుకు పలువురు చూపుతున్న ఆసక్తి, తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల బరిలో ఉంటానని పవన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సుస్మిత నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. పరకాల సీటుపై గతంలోనే సుస్మిత ఆశలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో ఆమె తల్లి మంత్రిగా ఉన్నా టికెట్ విషయంలో అనిశ్చితి నెలకొనడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈరోజు చర్చల తర్వాత స్పష్టం కాకున్న సుస్మిత ప్లాన్

జనసేన వైపు మళ్లితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని ముందుకు నడిపే నాయకత్వం కూడా తామే అవుతామని అంచనాలు వేస్తున్నారు. నేటి సమావేశం తర్వాత సుస్మిత తదుపరి ప్రణాళికలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే బీసీ నాయకురాలైన కొండా సురేఖ విషయంలో అధిష్టానం కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ తేడా వస్తే వీరు జనసేన బాట పట్టే అవకాశం ఉందని చర్చ సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+