Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ కు పోటీగా మరో పార్టీ..!! కోమటిరెడ్డితో కొండా భేటీ : కీలక నిర్ణయం దిశగా..!!

రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ రానుందా. ప్రస్తుత పరిస్థితుల్లొ అది సాధ్యమేనా. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కొండా రాజకీయ రూటు పైన చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి..బీజేపీ లో చేరిన సమయంలో ఆయనతో కొండా సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు తాజాగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వరంగల్‌ రాహుల్‌ గాంధీ సభకుకాని, పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి కాని హాజరు కాలేదు.

ప్రాంతీయ పార్టీ ఉంటే మంచిది

ప్రాంతీయ పార్టీ ఉంటే మంచిది

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తనను కలిసినట్లు వస్తున్నవార్తల్లో వాస్తవం లేదని కొండా విశ్వేశ్వర్​ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌తో పాటు భాజపా నుంచి కూడా తనకు ఆహ్వానం ఉందని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారు. కొండా తాజాగా కోమటిరెడ్డితో సమావేశమైన సమయంలో రాజకీయంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను ఓడించటమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయని ప్రచారం సాగుతోంది. రాబోవు రెండు మూడు నెలల్లో భారీ మార్పులు వస్తాయన్న ఆయన తెలంగాణ కోసం ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే మంచిదని, రెండు రీజినల్ పార్టీలు ఉంటే రాష్టం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

కోమటిరెడ్డి అదే ఆలోచనతో

కోమటిరెడ్డి అదే ఆలోచనతో

దీని ద్వారా కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయని.. స్థానిక ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు వెంటనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తపార్టీ పెట్టాలంటే రెండు, మూడు వేల కోట్లు రూపాయలు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్నారు. బీజేపీకి నాయకులు ఉన్నా ఓట్లు లేవనే అభిప్రాయం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో కేడర్ - ఓట్లు ఉన్నా జాతీయ నాయకత్వం బలహీనంగా ఉందని చెప్పుకొచ్చారు. తాను, రాజగోపాల్‌ రెడ్డి ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నామని విశ్వేశ్వర్​ రెడ్డి స్పష్టం చేసారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకమని, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా ఇదే ఆలోచనతో ఉన్నారని వివరించారు.

కేసీఆర్ పై 75 శాతం మందిలో వ్యతిరేకత

కేసీఆర్ పై 75 శాతం మందిలో వ్యతిరేకత

కేసీఆర్ పాలనపై సర్వేలో 75శాతం వ్యతిరేకత ఉందని, కేవలం 25శాతం కంటే కూడా తక్కువ కేసీఆర్‌కు మద్దతు ఉందని విశ్లేషించారు. కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం తగ్గిందని తేల్చి చెప్పారు. బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉందని వివరించారు. అయితే, తాను కాంగ్రెస్ లో చేరుతున్న వార్తలను ఆయన ఖండించారు. అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డిని మినహా ఇతర కాంగ్రెస్‌ నేతలను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తటస్థంగా ఉంటున్నానని తేల్చి చెప్పారు. తనకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని వివరించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీలోకి వెళ్లాలా.. లేక..కొత్తగా పార్టీ పెట్టాలా అనే అంశం పైన సమాలోచనలు చేస్తున్నామంటూ కొత్త చర్చకు కారణమయ్యారు.

కొత్త పార్టీ సాధ్యమేనా.. ఏం జరగనుంది

కొత్త పార్టీ సాధ్యమేనా.. ఏం జరగనుంది


దీని ద్వారా కొత్త పార్టీ దిశగానూ ఆలోచనలు జరుగుతున్న విషయాన్ని వెల్లడించారు. అయితే, ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తే..కలిసొచ్చేది ఎవరు.. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. అంచనాలు ఏంటనే కోణంలో చర్చలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో...తెలంగాణలో ఇప్పటికే రాజకీయంగా వాతావరణం వేడెక్కుతున్న పరిస్థితుల్లో మాజీ ఎంపీ కొండా చెబుతున్న విషయాలతో పరిణామాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పైన కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+