రేవంత్ మార్క్ ట్రాన్స్‌ఫర్లు: హైదరాబాద్‌కు కొత్త పోలీస్ కమిషనర్..!!
Hyderabad Police Commissioner: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే రెండు హామీలను అమల్లోకి తీసుకొచ్చారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ కింద బీమా కవరేజీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు.
ఇక శాంతిభద్రతలపై దృష్టి సారించారు రేవంత్ రెడ్డి. అత్యంత కీలకమైన హైదరాబాద్, దీనికి ఆనుకుని ఉన్న కమిషనరేట్లను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త అధిపతులను నియమించారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు.

మొత్తం అయిదుమంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొద్దిసేపటి కిందటే జీవో 1632ను విడుదల చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన పోలీస్ విభాగం ఆర్గనైజేషనల్ అండ్ లీగల్ అదనపు పోలీస్ డైరెక్టర్‌గా పని చేస్తోన్నారు.
యాంటీ నార్కొటిక్స్ బ్యురో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ జీ సుధీర్ బాబుకు స్థానచలనం కలిగింది. ఆయనను రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడున్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం.
సైబరాబాద్ జాయింట్ కమిషనర్ (అడ్మిన్) అవినాష్ మహంతి బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడున్న స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.












Click it and Unblock the Notifications