CPI: ఎమ్మెల్యేనే కానీ.. సాధారణ పౌరుడిలా మారిపోయారు..
పేద ప్రజల కోసం పోరాటం చేస్తారు.. పోడు భూముల హక్కుల కోసం ఆందోళన చేస్తారు. కార్మికులకు అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు అండగా ఉంటారు. ఇంతకీ ఎవరు వారు.. అంటే.. వారే కామ్రేడ్లు.. ఎర్ర జెండా పట్టుకుని పేదల పక్షన కొట్లాడే సీపీఐ, సీపీఎం ఇతర వామపక్షల బలం దేశంలోనే కాదు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. దీంతో కామ్రేడ్ ఎమ్మెల్యే లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
కానీ ఈసారి మాత్రం సీపీఐ నుంచి ఓ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆయనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం నుంచి సాంబశివరావు గెలిచారు. అయితే సీపీఎం మాత్రం కొన్ని చోట్లు పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. ఒక్క సీట్ అయినా వచ్చేదని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.

అదంతే పక్కనే పెడితే.. కామ్రేడ్ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఆదర్శంగా ఉంటారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్నా సాదాసీదాగా ఉంటారు. సామాన్య పౌరుల్లో కలిసిపోతారు. అదే బాటలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్త గూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు నడుస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ లోని సీపీఐ స్టేట్ ఆఫీస్ ముందు సాధారణ వ్యక్తిలా వచ్చి టీ తాగారు. కూనంనేనిని గుర్తించిన టీస్టాల్ నిర్వహకుడు హనుమంతరావు యాదవ్ అభిమానంతో ఆయన్ను సన్మానించారు కూడా.
చిన్న సర్పంచ్ పదవి వస్తేనే.. కారు.. అనుచురలను మెయింటెన్ చేస్తుంటారు. కానీ సాంబశివరావు మాత్రం మామూలు వ్యక్తిలా చాయ్ తాగాడం అందరు అభినందిస్తున్నారు. అయితే జనం కూడా హంగు, ఆర్బాటులు ఉన్న వ్యక్తులకే విలువ నిస్తున్నారు. మనుషుల కంటే వారి అధికారం, డబ్బుపైనే దృష్టి పెడుతున్నారు.












Click it and Unblock the Notifications