Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Koti Deepotsavam 2025: నవంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో భక్తి టీవీ కోటి దీపోత్సవం

భారతీయ సంస్కృతికి మూలం ఆధ్యాత్మికత. భక్తి, ధర్మం, సేవ ఈ మూడు విలువలు భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ విలువలను నిత్య చైతన్యవంతంగా ముందు తరాలకు అందించేంందు భక్తి టీవీ నరేంద్ర చౌదరి చేస్తున్న మహా యజ్ఞమే.. కోటి దీపోత్సవం. ప్రతి ఏడాది భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తూ వస్తున్న కోటీ దీపోత్సవం కార్యక్రమం ఎంతో మంది భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవంలో భాగంగా ముక్కోటి హిందూ దేవాది దేవతల పూజ నిర్వహిస్తూ ఉన్నారు. అంతే కాకండా కార్తీక మాసం అంటే దీపానికి ప్రతీక. కాబట్టి కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.

2012లో లక్ష దీపోత్సవంగా మొదలైన ఆధ్యాత్మిక ప్రయాణం..ప్రతియేటా దేదీప్యమానంగా వెలుగులు ప్రసరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ ఏడాది కూడా అదే నిబద్ధతతో, ఆధ్యాత్మిక చింతనతో కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించి భక్తుల హృదయాల్లో భక్తి జ్వాలలను నింపేందుకు సిద్ధమైంది నరేంద్ర చౌదరి నేతృత్వంలోని భక్తి టీవీ. ఈ ఏడాది కూడా కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి 13 వరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం.. ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు, లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం మాటలకు అందనిది.

Koti Deepotsavam 2025 Grand Spiritual Festival in Hyderabad from November 1 to 13

దీపం అంటే కేవలం వెలుగునిచ్చేది మాత్రమే కాదు. సనాతన ధర్మంలో దీపం... జ్ఞానానికి, శాంతికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. తమసో మా జ్యోతిర్గమయ అనే ఉపనిహత్తు వాక్యాన్ని భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆత్మగా ముందుకు సాగుతోంది. 13 యేట అడుగుపెట్టిన భక్తి టీవీ కోటి దీపోత్సవం.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. యావత్ దేశంలోనే అత్యంత నియమనిష్టలతో నిర్వహించే ఆధ్యాత్మిక సంబరంగా వెలుగొందుతోంది.
ప్రతి దీపపు వెలుగులో జ్ఞానం వికసిస్తుంది. కోటి దీపోత్సవాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించే భక్తుల కుటుంబాలు ఆధ్యాత్మిక చింతనతో నింపుతున్నాయి. శివనామస్మరణ మధ్య కోటి దీపాలు ప్రసరించే వెలుగులు ఆధ్యాత్మిక శక్తికి దర్పణంలా కనిపిస్తాయి.

భక్తి టీవీ ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవం నేటి ఆధునిక యుగంలో సనాతన విలువలను భక్తులకు దగ్గరగా చేసే వేదికగా మారిందనడం అతిశయోక్తి కాదు. భారతీయ హిందూ సనాతన ధర్మాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే బృహత్తర కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్న నరేంద్ర చౌదరి ఆ యజ్ఞాన్ని మనసా వాచా కర్మణా కొనసాగిస్తున్నారు.

ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్‌ 1న ప్రారంభమవుతోంది. అంతేకాదు ఈ నెల నవంబర్ 13 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలువైపులతో పాటు తెలంగాణ, ఏపీ నుంచి పలువురు భక్తులు తరలి వస్తారు. అలాగే దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, హైందవ సమాజ సేవకులు వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు.ఈ సారి కూడా అదే విధంగా కోటీ దిపోత్సవం విజయవంతం అవుతుందనే భక్తులు విశ్వసిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+