కొత్తగూడెంలో దారుణం: తాగిన మైకంలో తిట్టిన వ్యక్తి..కోపంతో చెవి, మర్మాంగం కోసేసి ఆపై..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఉన్న ఒక వ్యక్తి తనను తిట్టాడు అన్న కోపంతో విచక్షణ మరచి అతని చెవులు,మర్మాంగాన్ని కోసేసిన దారుణ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక అసలు విషయానికొస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హైదరాబాద్ కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండి పై చిల్లరి సామాన్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితమే కొత్తగూడ రుద్రంపూర్ ప్రాంతానికి వలస వచ్చిన అతను స్థానికంగా శిధిలమైన ఓ భవనంలో ఉంటున్నాడు. అయితే అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలిపని చేసుకునే హుస్సేన్ పాషా అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి, మద్యం మత్తులో కార్తీక్ ని దూషించాడు. నోటికొచ్చినట్టు తిట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.ఘర్షణ మరింత పెరగడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయిన కార్తీక్ పాషా చెవిని,మర్మాంగాన్ని కత్తితో కోసేసాడు.

ఆ తర్వాత తానే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. ఇక సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేవలం క్షణికావేశంలో తనను తిట్టాడని కోపంతో ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసి కార్తీక్ నిందితుడిగా మారగా, తాగిన మైకంలో కార్తీక్ ని దుర్భాషలాడిన పాషా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.












Click it and Unblock the Notifications