కృష్ణుడికి తాపీ ధర్మారావు అవార్డు: 19న ప్రదానం
హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, రచయిత, కవి ఎ.కృష్ణారావు 2015 సంవత్సరానికి తాపీ ధర్మారావు పురస్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 19వ తేదీన తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని తాపీ ధర్మారావు వేదిక తెలిపింది.
‘నేటి మీడియా విస్మృత వర్గాలు' అనే అంశంపై కృష్ణారావు ప్రసంగిస్తారని తెలిపింది. కృష్ణారావు ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా పని చేశారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా ఆయన న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఇంతకు ముందు ఈ అవార్డును డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, డాక్టర్ కె. శ్రీనివాస్, టంకశాల అశోక్, జి. శ్రీరామమూర్తి అందుకున్నారు. ఈ ఏడాది కృష్ణారావు ఈ పురస్కారాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పూర్వ సభ్యులు ఆచార్య కెఎస్ చలం అందుకుంటారు.
కృష్ణారావు కృష్ణుడిగా ప్రసిద్ధుడు. ఆయన కృష్ణుడి పేరు మీద కవిత్వం రాస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా ఆయన కవితా సంకలనం ఒకటి విడుదలైంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications