గతం కన్నా మెరుగ్గా: విద్యుత్‌పై కేసీఆర్‌ను ప్రశంసించిన కృష్ణయ్య..
సీఎం కేసీఆర్ చొరవతో గతంలో కన్నా మెరుగైన విద్యుత్ ను రాష్ట్ర ప్రజలు పొందుతున్నారని కృష్ణయ్య కొనియాడారు.
హైదరాబాద్: ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు అసెంబ్లీలో విద్యుత్ గురించిన చర్చ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య అభినందించారు.

సీఎం కేసీఆర్ చొరవతో గతంలో కన్నా మెరుగైన విద్యుత్ ను రాష్ట్ర ప్రజలు పొందుతున్నారని కొనియాడారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నాని అభిప్రాయపడ్డారు. విద్యత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం పట్ల కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.
రైతులందరికీ సోలార్ ప్యానల్స్ మీద సబ్సిడీలు ఇవ్వాలని, సోలార్ విద్యుత్ పై రైతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్బంగా కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications