బాబుకు కేటీఆర్ ట్వీట్ సవాల్, ఒత్తిడిలో రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య సమస్య కాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. తన పైన వచ్చిన ఆఱోపణలకు టీవీ చానళ్ల ముందు లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని చెప్పారు.

అలాగే, ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లైడిక్టర్ పరీక్షలకు సిద్ధమా అని సవాల్ చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సమస్యగా సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అవినీతి చేష్టలు బట్టబయలు అయ్యాయని, ఆయనకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కేటీఆర్ ట్విట్టర్‌లో సవాల్ చేశారు.

KT Rama Rao on twitter about Chandrababu

తడాఖా చూపిస్తాం: నన్నపనేని

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ను ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ హడావుడి కొంచెం తగ్గాక తమ తడాఖ చూపిస్తామని చెప్పారు.

రాబోయే రోజుల్లో ఎవరు రాణిస్తారో, ఎవరు మంచిపేరు తెచ్చుకంటారో, ఎవరు స్వార్థం కోసం పని చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని, దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు.

రేవంత్‌కు ఆరోగ్య పరీక్షలు

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రఫీ మాట్లాడుతూ.. రేవంత్, ఉదయ్‌లకు బీపీ ఉన్నట్లు చెప్పారు. సెబాస్టియన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. రేవంత్ ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. అనంతరం వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+