ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్ (వీడియో)
KTR-Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. నిత్యం ఒకరిపై ఒకరు రాజకీయ వాగ్బాణాలు సంధించుకునే ఆ నాయకులను వరద కలిపింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు అనూహ్యంగా వరద ప్రాంతాల పర్యటనలో కలుసుకున్నారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఇరుపురు నేతలు సిరిసిల్ల జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వారిద్దరు ఒకే చోటు కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న ఐదుగురు రైతులను హెలికాప్టర్ సహాయంతో ఇవాళ రెస్క్యూ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ బాధితులను పరామర్శించడానికి అక్కడికి చేరుకున్నారు. రైతులు సురక్షితంగా బయటపడిన తర్వాత, వారితో మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. అదే సమయంలో కేటీఆర్ కూడా ఎగువ మానేరు జలాశయం వద్దకు వచ్చారు.

ఈ అరుదైన సందర్భంలో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. నిత్యం రాజకీయ విమర్శలు చేసుకునేవారు కావడం వల్ల, అక్కడున్న వారంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూశారు. అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ, బండి సంజయ్, కేటీఆర్ చేతులు కలుపుకుని, నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఈ దృశ్యం చూసిన ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు తమ తమ నేతలకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "వరద కలిపిన బంధం" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజలకు కష్టమొచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉంటారని మరోసారి నిరూపించింది.
KTR went up to Bandi Sanjay anna's car while he was returning after his visit but this scribe twist it into propaganda. @TeluguScribe Stop your drama be a news agency not a propaganda kahani pic.twitter.com/mzKANlCFca
— Anishetty Tweets (@AnishettyTweets) August 28, 2025












Click it and Unblock the Notifications