• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి కేటీఆర్ - యశ్వంత్ సిన్హాకు మద్దతుగా: నేడే నామినేషన్ - సీఎం కేసీఆర్ హామీతో..!!

|
Google Oneindia TeluguNews

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుపై క్లారిటీ వచ్చింది. ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేసీఆర్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధికి మద్దతిస్తారని అందరూ భావించారు. కానీ, మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ తో కలిపి వేదిక పంచుకోవటానికి టీఆర్ఎస్ దూరం పాటించింది. కానీ, విపక్షలు అభ్యర్ధిని ప్రకటించే సమయంలో ఎన్సీపీ అధినేత పవార్ సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. ఆ సమయంలో కేసీఆర్ తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా పవార్ వెల్లడించారు. ఇటు టీఆర్ఎస్ నుంచి మాత్రం అధికారికంగా రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశం పైన స్పష్టత ఇవ్వలేదు.

విపక్ష పార్టీలతో కలిసి కేటీఆర్

విపక్ష పార్టీలతో కలిసి కేటీఆర్


కొత్త పార్టీ ప్రకటన పైన సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో..మంత్రి - టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ రోజున విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉండనున్నారు.

పవర్ కు కేసీఆర్ హామీ - నేడే నామినేషన్

పవర్ కు కేసీఆర్ హామీ - నేడే నామినేషన్

కేటీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, చేవెళ్ళ, పెద్దపల్లి, మెదక్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, ప్రభాకర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి హాజరుకానున్నారు. నామినేషన్‌కు ముందుగా సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయం వద్ద సమావేశమవనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి హాజరు విషయం పైన కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. తాను హాజరు కావటం లేదా.. ఎవరిని ప్రతినిధులుగా పంపాలనే అంశం పైన అభిప్రాయ సేకరణ చేసారు. చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ను పంపాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు చేసారు. ఎన్డీఏ కూటమి తో పాటుగా వైసీపీ వంటి మద్దతు పార్టీల నేతలు ఆ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

జాతీయ పార్టీకి మద్దతు కోసం వ్యూహాత్మకంగా

జాతీయ పార్టీకి మద్దతు కోసం వ్యూహాత్మకంగా

ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 30 మంది నామినేషన్లు దాఖలు చేసారు. అయితే, వారిలో ప్రతిపాదకుల సంతకాలు లేవు. దీంతో..స్క్రూటినీ సమయంలో వీటిని తిరస్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్.. బీజేపీ - కాంగ్రెస్ తో సమ దూరం పాటిస్తూ.. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో సఖ్యత కోరుకుంటున్నారు. దీంతో..ఇప్పుడు విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ప్రకటించటం..భవిష్యత్ లో వారి మద్దతు తీసుకోవటం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. విపక్షాల అభ్యర్ధి ఎంపిక విషయంలో.. పవార్ ముందుగానే కేసీఆర్ తోనూ చర్చించటం ద్వారా తాను ఇచ్చిన హామీ మేరకే ఇప్పుడు తన ప్రతినిధిగా కేటీఆర్ ను నామినేషన్ కార్యక్రమానికి పంపాలని నిర్ణయించారు.

English summary
KTR and TRS leaders participate in Yaswanth Sinha nomination for presidential elections, As CM KCR assurance to Pawar supporting Sinha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X