ఎల్లుండి సంచలన వార్త పంచుకుంటారట: ఆసక్తి రేపిన కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్: ఓ పెద్ద సంచలన వార్తను ప్రకటిస్తానని తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే ఆ వార్తను ఇప్పుడు కాదని, అంతా ఎల్లుండి మీతో పంచుకుంటానని ఆయన ఉత్కంఠకు స్థానం కల్పించారు.
అంతవరకు సస్పెన్స్ అంటూ తాను ప్రకటించబోయే వార్తేమిటనేది విషయాన్ని సూచనప్రాయంగా కూడా చెప్పలేదు. వాస్తవానికి కేటీఆర్ సీరియస్‌గానే ఉంటారు కాబట్టి ఏదో పెద్ద విషయాన్నే వెల్లడించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా పార్టీ భాద్యతలు నిర్వహిస్తున్న కెటీఆర్ తనదైన పద్ధతిలో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దాంతో ఆయన ఎల్లుండి ప్రకటించబోయే సంచలన వార్తేమిటనేది ఆసక్తి రేగుతోంది.

అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ నెల 19న హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో టిమ్‌కుక్ భేటీ అవుతారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో కూడా టిమ్‌కుక్ సమావేశం కానున్నారు. యాపిల్ సీఈవోగా కుక్ నియమితులైన తర్వాత భారత్‌కు రానుండటం ఇదే తొలిసారి. భారత్‌లో తొలి రిటైల్ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయడానికి యాపిల్ ప్రణాళికలు రచిస్తున్నది. కెటిఆర్ ఎల్లుండి చేయబోయే సంచలన ప్రకటన దీనికి సంబంధించిందే కావచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎన్డీయేలో చేరబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాంతో కెటిఆర్ ట్వీట్‌పై మరింత ఉత్కంఠ రేగుతోంది.












Click it and Unblock the Notifications